ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో.. వైసిపి వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఒకపక్క అధికారం కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో.. పలువురు నేతలు పార్టీని వీడటం.. ఇప్పుడు జగన్ జైలుకు వెళ్లే పరిస్థితి రావడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ చేసిన కార్యక్రమాలకు ఇప్పుడు.. ప్రభుత్వం చుక్కలు చూపించేందుకు రెడీ అవుతుంది.
Also Read : ఉక్రెయిన్ మాస్టర్ మైండ్.. ఒక్క అటాక్ తో రష్యాకు షాక్.. అమెరికాకు వార్నింగ్
అయితే జగన్ తనని తాను కాపాడుకుంటారా అనే దానిపై ఆసక్తి పెరిగిపోతుంది. భారతీయ జనతా పార్టీకి జగన్ దూరంగా ఉన్నట్లు కనపడినా.. గతంలో ఆ పార్టీకి వీలైనన్ని మార్గాల్లో జగన్ అండగా నిలుస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం లభించకపోవచ్చు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా నిధులు కేటాయించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్న సరే.. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసే విషయంలో మాత్రం సహకరించకపోవచ్చు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి మాట.
Also Read : ఎందుకు ఈ మౌనం.. సాక్షి తప్పుడు ప్రచారంపై సైలెంట్ గా కూటమి
కేంద్ర పెద్దలు గతంలో చంద్రబాబును వ్యతిరేకించిన సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఎక్కువగా సహకారం అందిస్తూ వచ్చారు. దాన్ని అదునుగా చేసుకొని జగన్ అప్పట్లో చెలరేగిపోయారు. ఇక వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత కూడా బిజెపి విషయంలో జాగ్రత్తగానే ఉంటున్నారు వైసీపీ అధినేత. గతంలో తాను చేసిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని అరెస్టు కానీయకుండా కేంద్రం అడ్డుపడే అవకాశం ఉండవచ్చనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. 2014 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డిని బిజెపి పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండకపోవచ్చు. ఇప్పటికీ జగన్ తన కేసుల్లో కనీసం కోర్టుకు కూడా హాజరు కావడం లేదు. ఇది ఖచ్చితంగా కేంద్ర పెద్దల సహకారమే అనేది చాలామంది అభిప్రాయం. ఆ స్థాయిలో వాళ్ల నుంచి సహకారం ఉంది కాబట్టే జగన్ ఇప్పుడు కూడా అరెస్టు కాకపోవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.