ఏ విషయంలో అయినా సరే చంద్రబాబు ఆలోచన చాలా లోతుగా ఉంటుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయడమే చంద్రబాబు విధానం. 1997లోనే విజన్ 2020 అని ఓ లక్ష్యాన్ని నిర్దేశించారు. 20 ఏళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఇప్పుడే అంచనా వేయగల సమర్థులు. ఇప్పుడు కూడా విజన్ 2047 డాక్యుమెంట్ తయారు చేశారు. ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి నిలవాలనే లక్ష్యంతో చంద్రబాబు ఇప్పటి నుంచే పని చేస్తున్నారు. చంద్రబాబును దగ్గరగా చూసిన వారకి ఆయన ప్లానింగ్ తెలుస్తుంది. అది రాజకీయమైనా.. అభివృద్ధి అయినా.. రాష్ట్రం గురించి అయినా సరే.. చంద్రబాబును విజనరీ అనే అంటారు.
Also Read : విజయ్ దేవరకొండ యాక్సిడెంట్ వెనుక అసలు కారణం ఇదేనా?
చంద్రబాబు మాట వెనుక చాలా అర్థం ఉంటుంది. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక మొదలు.. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తుల వరకు చంద్రబాబు ఆలోచన చాలా లోతుగా ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దాని వెనుక తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అందుకే రాజకీయాల్లో తలపండిన నేతలు కూడా చంద్రబాబుతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తారు. 45 ఏళ్ల వయసులోనే దేశ రాజకీయాలను శాసించారు చంద్రబాబు. 1999లో ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయ్ కొనసాగేందుకు చంద్రబాబు వ్యూహం ఉందనేది అందరికీ తెలిసిన విషయం.
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. కూటమిలో తెలుగుదేశం పార్టీతో జనసేన, భారతీయ జనతా పార్టీలు జత కట్టాయి. ఎన్నికల్లో కూటమి ఘన విజయం వెనుక చంద్రబాబు కష్టం ఉందనేది పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్న మాట. చంద్రబాబు విజన్‌ను చాలా దగ్గరగా చూసిన పవన్.. మరో 15 ఏళ్ల పాటు కూటమి పొత్తు కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించారు కూడా. చంద్రబాబు ఉన్నంత వరకు ఆయనే సీఎం అభ్యర్థి అని కూడా పవన్ క్లారిటీ ఇచ్చారు. పవన్ ప్రకటన ముందు ఆశ్చర్యం కలిగించినా.. చంద్రబాబు విజన్‌కు పవన్ ఫిదా అనే విషయం తెలిసిన తర్వాత అంతా సైలెంట్ అయ్యారు.
Also Read : ట్రంప్ బాటలో యూకే..? విదేశీ విద్యార్థులకు షాక్ తప్పదా..?
ఇక తాజాగా చంద్రబాబు తీసుకున్న ఓ నిర్ణయం పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయటం లేదని సైకిల్ పార్టీ నేతలు ప్రకటించారు. దీంతో తెలంగాణలో తెలుగు తమ్ముళ్లు కాస్త నిరాశ చెందారు. వాస్తవానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ టీడీపీ అభిమానులున్నారు. సరైన నేత లేకపోవడంతో క్యాడర్ సైలెంట్‌గా ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో సరైన అవకాశం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాలని ముందు భావించింది. ఇందుకు ప్రధాన కారణం.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. అందుకే ఆ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. 2014లో మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేసి గెలిచారు. అందుకే ప్రస్తుతం ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ చేస్తే మంచి మైలేజ్ వస్తుందని.. పార్టీ నేతలు చంద్రబాబుకు సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయంలో నేతల అభిప్రాయం తీసుకున్నారు. నేతల సలహా మేరకు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
Also Read : మద్యం వద్దు.. ఏపీ మందు బాబులకు నిపుణుల వార్నింగ్
అయితే చంద్రబాబు నిర్ణయం వెనుక చాలా బలమైన కారణం ఉందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుత ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇద్దామనేది చంద్రబాబు మాట. దీనికి బదులుగా రాబోయే రోజుల్లో బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలనేది బాబు ప్లాన్. జీహెచ్ఎంసీ ఎన్నికతో పాటు 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసే సీట్ల బేరం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఎంత ఒదిగి ఉంటే.. భవిష్యత్తులో అంత డిమాండ్ చేయవచ్చు అనేది చంద్రబాబు ప్లాన్. అందుకే ప్రస్తుత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉందామని చంద్రబాబు నేతలకు సూచించారు. ప్రచారం విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో కూటమి పొత్తులో భాగంగా మెజారిటీ సీట్లు డిమాండ్ చేసి తీసుకోవాలనేది చంద్రబాబు ప్రణాళిక.