Friday, September 12, 2025 07:25 PM
Friday, September 12, 2025 07:25 PM
roots

బాబు వ్యవహారశైలితో లోకేష్ కి డ్యామేజ్ జరుగుతుందా?

చంద్రబాబు వ్యవహారశైలితో లోకేష్ కు డ్యామేజ్ జరుగుతుందా? రాష్ట్రంలో కొంత మంది అధికారుల మీద రోజూ ప్రధాన పత్రికల్లో వస్తున్న వార్తలు చుస్తే వారు ఇంకా వైసిపి మత్తులోనే జోగుతున్నారు అనిపిస్తుంది. ప్రభుత్వం గానీ, మంత్రులు గానీ వాళ్ల విషయంలో ఎందుకు ఉదాసీనంగా వుంటున్నారో అర్ధం కావడం లేదు. నవరాత్రులు ప్రారంభమైన వెంటనే దుర్గ గుడి ఈవో రామారావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి నాయకుడు పోతిన మహేష్ కు దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనం, ఆశీర్వచనాలు ఇప్పించడమే కాకుండా ప్రతి రోజు క్రమం తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పటివరకు దీని మీద చర్యల్లేవు.

వైసిపి నాయకుడు దేవినేని అవినాష్ కు అంతరాలయ దర్శనం… రత్నారెడ్డి అనే సీనియర్ అసిస్టెంట్ రత్నారెడ్డి సస్పెన్షన్. అధికారులకు ఎంత లెక్కలేనితనం ఉంటే వాళ్లకు ఇలాంటి గౌరవం ఇస్తారు. అదే తెలుగుదేశం ఇంత ఘోరంగా ఓడిపోతే, ఆ పార్టీ నాయకులకు ఇలాంటి అవకాశం ఇచ్చే ధైర్యం చేయగలరా? అసలు గుళ్లోకి కూడా రానివ్వరు. మనది డెమోక్రసీ, మనం అందరినీ గౌరవించాలి అనే పంథాలో వెళ్తున్నామని చెప్పుకోడానికి బాగానే వుంటుంది. క్యాడర్ కు మాత్రం ఇది జీర్ణం కాదు. అసెంబ్లీ చీఫ్ మార్షల్ థియోఫిలస్ గురించి చెప్పుకుంటే.. ఈయన జగన్ అధికారంలో వున్నప్పుడు చీఫ్ మార్షల్. చంద్రబాబు పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారు, చాలా ఫిర్యాదులున్నాయి. సర్వీసు రిజిస్టర్ లో కూడా ఆ ఫిర్యాదులు నమోదయ్యాయి.

అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ సెలవు మీద ఉన్నప్పుడు జాయింట్ సెక్రటరీగా వున్న విజయరాజు థియోఫిలస్ ప్రమోషన్ ఫైలు క్లియర్ చేశాడు. ప్రసన్నకుమార్ తరపున తానే సంతకాలు పెట్టి పంపాడు. డిజిపి ఆఫీసు వాళ్లు ఎంక్వయిరీ చేసినప్పుడు ఇది బయటపడింది. విజయరాజుని సంజాయిషీ అడిగితే మండలి చైర్మన్ మోషెన్ రాజు ఒత్తిడి మేరకు క్లియర్ చేసినట్టు చెప్పారు. దీని మీద చంద్రబాబు ఆరాతీసి వివరాలు తెలుసుకున్నప్పటికీ యథావిధిగా వదిలేశారు. వైసిపి ఏజెంట్ గా వున్న విజయరాజు బతికిపోయాడు. ఇప్పుడు మోషెన్ రాజు పాత్ర ఏంటో తేలాల్సి వుంది.

ఫైబర్ నెట్లో ఇంకా జగన్ మనుషులే వున్నారని, ఎప్పటికప్పుడు సమాచారం లీక్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చంద్రబాబు మీద కేసులు పెట్టించడంలో కీలకంగా వ్యవహరించినవాళ్లు నిక్షేపంగా అక్కడే వున్నారు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ CFO గా రమణారెడ్డి, ఏపీ జెన్కోలో సాక్షి ఉద్యోగి రఘురామిరెడ్డిలను నియమించాలని దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సిఫార్సు చేశారు. బహుశా ఆయనకు ఇంకా పాతవాసనలు పోలేదేమో. పత్రికలలో వార్తలు రావడంతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వీళ్ల బ్యాగ్రౌండ్ గురించి విచారించి, వెంటనే ఆ నియామకాలను తిరస్కరించారు.

సమాచార శాఖ కమిషనర్ గా చేసిన విజయకుమార్ రెడ్డి సాక్షి మీడియాకు వందల కోట్లు దోచిపెట్టాడు. డిప్యూటేషన్ రద్దు చేసుకుని నిక్షేపంగా వెళ్లిపోయాడు. జాషువా అనే ఐపిఎస్ అధికారి బెదిరించాడని చిలకలూరిపేట క్వారీ యజమానులు కేసు పెడితే దిక్కులేదు. మాజీ మంత్రి విడదల రజని బెదిరించి డబ్బు వసూలు చేసిందని కేసు పెడితే ఇంతవరకు యాక్షన్ లేదు. చిలకలూరిపేటలో విడదల రజనీని సోషల్ మీడియాలో విమర్శించాడని పిల్లి కోటి అనే తెలుగుదేశం దళిత కార్యకర్తని వారం రోజులు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కొడుతూ లైవ్లో రజనీకి చూపించిన సిఐ సూర్యనారాయణ నిక్షేపంగా ఒంగోల్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు.

నందిగామ డిఎస్పీ రవికిరణ్ వైసిపి తొత్తు అని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. జగ్గయ్యపేట, నందిగామ ఎమ్మెల్యేలు ఈ డిఎస్పీని మార్చమని హోంమంత్రిని కోరినా ఫలితం లేదు. ఇప్పటికీ ఆయన వైఖరి మారలేదు. హోమ్ మంత్రి సామాజికవర్గం కాబట్టి మార్చడం లేదన్న ఆరోపణలున్నాయి. చిత్తూరు జిల్లాలో ఒక కానిస్టేబుల్ ను కోరుకున్న చోటుకు బదిలీ చెయ్యాలని సాక్షాత్తు ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఒక ఎమ్మెల్సీ సిఫారసు లేఖ ఇస్తే చిత్తూరు ఎస్పీ ఆయన్ను సస్పెండ్ చేశాడన్న ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్సీ లేఖ తెచ్చాడని కానిస్టేబుల్ ని సస్పెండ్ చెయ్యడం మనం వైసిపి జమానాలో వూహించగలమా? తోలు తీసి పక్కన కూర్చోబెట్టేవాళ్లు.

కర్నూలు జిల్లాలో మధ్యాహ్న భోజనంలో అవినీతి మీద విచారణ చెయ్యాలని ఎమ్మెల్యే ఇచ్చిన లేఖను తాసిల్దారు కార్యకర్తల ముఖం మీద విసిరికొట్టాడు. ఇలాంటివి రోజూ చాలా వింటున్నాం. ఐదేళ్లు వైసిపికి అనుకూలంగా పనిచేసిన అధికారులు ఇంకా ఆ మత్తు నుంచి బయటకు రావడం లేదు. గ్రౌండ్ లెవల్లో అధికారులెవరూ కార్యకర్తలకు సహకరించే పరిస్థితి లేదు. దీనికి తోడు ముఖ్యమంత్రి అధికారులతో జరిగే సమావేశాల్లో మీరు పార్టీలు చూడొద్దు. ఎవరు ఎక్కువ చేసినా యాక్షన్ తీసుకోండని పదే పదే చెప్పడం వల్ల వాళ్లు అసలు మాట వినే పరిస్థితుల్లో లేదు. ఇదంతా చూస్తుంటే ఉద్యోగుల వ్యవస్థ మీద కూటమి ప్రభుత్వానికి పట్టు వచ్చినట్టు కనిపించడం లేదు.

అందరికీ చంద్రబాబు గారికున్నంత ఓర్పు, క్షమాగుణం వుండదు. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడే ధైర్యం ఇక్కడెవరికీ లేదు. కనీసం చట్టపరంగా అయినా రెచ్చిపోయినోళ్ల మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యం, పచ్చిబద్దలంటూ ఇలాగే వదిలేస్తే, చంద్రబాబు గారికి బాగానే వుంటుంది. కానీ లోకేష్ గారికే ఇబ్బందికరం అవుతుంది. ఎందుకంటే ఇంకో అయిదేళ్ల తరువాతో, పదేళ్ల తరువాతో నాయకత్వ బాధ్యతలు లోకేష్ చేతుల్లోకి పోతాయి. అప్పుడు ఇవన్నీ ఆయనకు బ్యాడ్ మార్క్స్ గా మారే ప్రమాదం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్