ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయటికి చెప్పకపోయినా.. పెట్టుబడుల విషయంలో మాత్రం ఇబ్బందులు పడుతుంది అనే అభిప్రాయాలు గట్టిగానే వినపడుతున్నాయి. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలతో పెట్టుబడులు పెట్టేందుకు.. పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. 2014 నుంచి 2019 వరకు వచ్చిన వాళ్లను.. 2019 తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడంతో.. చాలామంది ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేకపోతున్నారు.
Also Read : జగన్‌కు షాక్ ఇచ్చిన మరో ముఖ్య నేత..!
ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు వేసిన కీలక అడుగు పెట్టుబడుల్లో ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చే అవకాశం ఉండవచ్చనే అభిప్రాయాలు బలంగా వినపడుతున్నాయి. ముఖ్యంగా ఐటి రంగంలో పెట్టబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని తీవ్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో మైక్రోసాఫ్ట్ ను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో మళ్లీ పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.
Also Read : దొంగల్లా వస్తున్నారు.. వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలనం
రాష్ట్రంలో బిల్ గేట్స్ పెట్టుబడులు పెడితే ఇతర పారిశ్రామికవేత్తలు ధైర్యం వస్తుందని.. చంద్రబాబు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకున్న కొంతమంది మళ్ళీ జగన్ వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని వెనక్కి తగ్గుతున్నట్లు ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు చూస్తూనే ఉన్నాం. ఈ టైంలో బిల్ గేట్స్ పెట్టుబడులు పెడితే.. కచ్చితంగా అది పాజిటివ్ అభిప్రాయాన్ని పారిశ్రామిక రంగంలో క్రియేట్ చేసే అవకాశం ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే చంద్రబాబు నాయుడు మరోసారి బిల్ గేట్స్ ను దారిలోకి తెస్తున్నారని చెప్పవచ్చు. మరి భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి