తెలంగాణాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఆ పార్టీ అధిష్టానం తీవ్రంగానే కష్టపడుతోంది. గతంలో టీడీపీలో చక్రం తిప్పిన నాయకులను పార్టీలోకి తిరిగి తీసుకురావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఎవరికి అయినా ఏ రూపంలో అయినా భయం ఉంటే ధైర్యం కల్పించి పార్టీలోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. ఇక బీజేపిలోకి వెళ్ళలేని.. లేదంటే కాంగ్రెస్ లో తిరస్కరణకు గురైన నేతలకు కూడా టీడీపీ రెడ్ కార్పెట్ పరుస్తుంది.
Also Read : అయ్యో పాపం… జగన్ పరిస్థితి ఇలా అయ్యింది ఏమిటీ…!
ఇటీవల ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. చంద్రబాబు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా ఆ ముగ్గురులో ఒకరు అయితే ఖచ్చితంగా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మారతామని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. వారితో పాటుగా మరో ఇద్దరు ముగ్గురు నేతలు కూడా పార్టీ మారేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పార్టీ మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని మీడియాలో కూడా పుకార్లు వచ్చాయి.
Also Read : పాపం కేటీఆర్… ఇలా ఇరుక్కుపోయారే..!
కానీ ఎందుకో తెలియదు వాళ్ళు పార్టీ మారడం ఆలస్యం అవుతోంది. దసరా తర్వాత మారే ఛాన్స్ ఉందన్నారు. దీపావళి తర్వాత మారవచ్చు అన్నారు… ఆ తర్వాత సంక్రాంతి అంటున్నారు. కానీ ఎప్పుడు మారతారో చెప్పడం లేదు. అయితే వారితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మాట్లాడి ఆపినట్టు ప్రచారం జరుగుతోంది. కాని వాళ్ళు బీఆర్ఎస్ లో మాత్రం యాక్టివ్ గా కనపడటం లేదు. దీనితో అసలు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. అసలు మారతారా లేక అలాగే ఉంటారా అనేది వాళ్ళే చెప్పాలి. తెలంగాణాలో టిడిపి కార్యక్రమాలు ఎందుకు వేగవంతం కావడం లేదో అర్ధం అవ్వక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో టిడిపి కార్యక్రమాలు, చేరికలు వాయిదా పడుతున్నాయా లేక వాయిదా వేస్తున్నారా అనే విషయం అధిష్టానమే క్లారిటీ ఇవ్వాలి.




