Saturday, September 13, 2025 08:38 AM
Saturday, September 13, 2025 08:38 AM
roots

ఇది వారి బలమా లేక వీరి బలహీనతా?

తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి జరిగింది… ఈ దాడి జరిగి దాదాపు మూడేళ్ళు అవుతోంది. ఈ మూడేళ్ళ కాలంలో దాడి చేసిన వాళ్ళు చాలా స్వేచ్చగా తిరిగారు, పదవులు అనుభవించారు. ఏ మాత్రం భయం లేకుండా రెట్టించిన ఉత్సాహంతో రాజకీయం చేసారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, పార్టీ ఆఫీసుపై దాడి చేసిన వాళ్ళ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. వాళ్ళను అరెస్ట్ చేయాలనుకుంది.. కాని చేయలేకపోయింది. సుప్రీం కోర్ట్ లో వాళ్లకు ముందస్తు బెయిల్ వచ్చింది. అక్కడి వరకు బాగానే ఉంది.

సుప్రీం కోర్ట్ ఆదేశాలతో నేతలు విచారణకు హాజరు అయ్యారు. అసలు ఈ విచారణలో వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారు. మీడియాలో మాత్రం విచారణకు హాజరైన లేళ్ళ అప్పిరెడ్డి, గవాస్కర్, అవినాష్ అనే వార్తలు వస్తున్నాయి గాని వాళ్ళు ఏం చెప్పారో, ఏం చేసారో విషయాలు మాత్రం ఏదీ బయటకు రావడం లేదు. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వైసిపికి చెందిన నలుగురు నేతల్ని రెండు రోజుల్లో విచారించిన మంగళగిరి రూరల్ పోలీసులు చిన్న విషయం కూడా రాబట్టలేకపోయారు. ఈ విషయాన్ని స్వయంగా రూరల్ సిఐ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు.

Read Also : కలియుగ దైవం మాయలే ఇవన్నీ

టిడిపి కార్యాలయంపై దాడి చేసిన వారికి వైసిపి ముఖ్య నేతలు డబ్బులిచ్చారన్న సమాచారం ఉందని, దీంతో బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని విచారణలో భాగంగా అడిగామని అయితే నేతలు విచారణకు సహకరించలేదు అని చెప్పారు. దేవినేని అవినాష్ గాని, అప్పిరెడ్డి గాని ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. రెండు విడతలుగా విచారణ జరుగుతున్నప్పటికీ ఎవరు సంతృప్తికరమైన సమాధానం చెప్పడం లేదు పోలీసులు అసహనం వ్యక్తం చేసారు. ఒక నేత అయితే తాను లోకల్ గా లేనని తన అనుచరులు వెళ్ళారని తర్వాత తెలిసిందని అర్ధం కాని సమాధానాలు చెప్పారట. మరో నేత అయితే తెలియదు, గుర్తు లేదు, అసలు బ్యాంక్ ఎకౌంటు తనకు ఉన్నా వాడను అని సమాధానం చెప్పారట. ఇది వాళ్ళ బలమో లేక కూటమి నాయకత్వం బలహీనతో అర్ధం కావడం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్