Friday, September 12, 2025 10:44 PM
Friday, September 12, 2025 10:44 PM
roots

ఈ లెక్కలు చూస్తే కోహ్లీ, రోహిత్ కంటే పుజారా, రహానే బెస్ట్

న్యూజిలాండ్ తో ఇండియా లో క్లీన్ స్వీప్ కావడం అంటే వినడానికే సిగ్గుగా ఉంది అంటున్నారు ఫ్యాన్స్. వాళ్ళను మడత పెట్టడానికి స్పిన్ పిచ్ లు రెడీ చేస్తే.. వాళ్ళు మన వాళ్ళను ఇస్త్రీ చేసి కబోర్డ్ లో పెట్టారు. గతంలో ఇండియా ఏ టీంపై మ్యాచ్ లు ఆడినా మూడు రోజుల్లోనే ఇండియాలో మ్యాచ్ లు ముగిసేవి. 5 రోజుల టెస్ట్ కంటే 3 రోజులు జరిగినవే ఎక్కువ. అది ఆస్ట్రేలియా అయినా, న్యూజిలాండ్ అయినా.. ఏ టీం అయినా సరే. అలాంటిది ఇప్పుడు ఇండియాను న్యూజిలాండ్ సాదా సీదా బౌలర్లతో ఓడించడం ఆశ్చర్యం కలిగించింది.

Also Read : టీం ఇండియా డైనమైట్

ఇక టీంలో టెస్ట్ స్పెషలిస్ట్ ఆటగాళ్ళు లేకపోవడం కూడా మైనస్ అయింది. పుజారా, రహానే వంటి సీనియర్లు ఉంటే ఖచ్చితంగా సీరీస్ ఫలితం వేరేలా ఉండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పిచ్ ఎలా ఉన్నా డిఫెండ్ చేసే సామర్ధ్యం ఉన్న ఆటగాళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళను టీం నుంచి తప్పించడానికి ముందు వాళ్ళ ప్రదర్శన ఒకసారి చూస్తే… పుజారాను తప్పించే ఆరు ఏడు నెలల ముందు అతని ఇన్నింగ్స్ లు… 90, 102*, 24, 6, 7, 0, 31*, 1, 59, 42, 14, 27. ఇక రహానే విషయానికి వస్తే ఏడాదిన్నర కాలంలో… 0, 58, 9, 1, 89, 46, 3, 8… ఓవర్సీస్ పిచ్ లపై రహానే ప్రదర్శన.

అదే టీం కెప్టెన్ రోహిత్ శర్మ విషయానికి వస్తే మార్చ్ లో ఇంగ్లాండ్ పై 103 మినహాయిస్తే… 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11. విరాట్ కోహ్లీ వెస్టిండీస్ పై గత ఏడాది జులైలో చేసిన 121 పరుగులు మినహాయిస్తే… 38, 76, 46, 12, 6, 17, 47, 29*, 0, 70, 1, 17, 4, 1. రహానే, పుజారాతో పోలిస్తే వీళ్ళ ఆట తీరు ఏం అంత గొప్పగా లేదు. పైగా రోహిత్ ఓవర్సీస్ పిచ్ లపై అంత గొప్పగా ఆడలేడు. కాని ఈ ఇద్దరినీ ఆస్ట్రేలియా సీరీస్ కు ఎంపిక చేసి రహానే, పుజారాను ఏ కారణంతో పక్కన పెట్టాల్సి వచ్చిందో బోర్డ్ చెప్పాలి. ఇప్పటికైనా జట్టు ఎంపికలో పారదర్శకత లేకపోతే ముందు ముందు మరిన్ని అవమానాలు తప్పవు. టెస్ట్ జట్టులో టెస్ట్ స్పెషలిస్టులు అవసరం ఎంత ఉందో కివీస్ తో సీరీస్ తెలియచెప్పింది. మరి దీని నుంచి పాఠాలు నేర్చుకుంటారో లేదో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్