తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక.. రాజకీయంగా ఏదోక సంచలనం ఉంటుందని చాలా మంది ఎదురు చూసారు. 41 ఏ నోటీసులు తప్పించి ఏం కనపడటం లేదు అనే అసహనం చాలా మందిలో కనపడుతుంది. కీలక కేసులు ఏమయ్యాయో.. ఏం జరుగుతున్నాయో ఎవరికి అర్ధం కాని పరిస్థితి ఉంది. పలు కీలక కేసులు నమోదు అయినా సరే వాటి విషయంలో ముందుకు వెళ్ళడం లేదు. ఇప్పుడు పార్టీ ఆఫీసుపై దాడి కేసు మినహా పెద్దగా ఊహించిన పరిణామాలు ఏవీ జరగడం లేదు. కేసులు నమోదు చేయడమే తప్ప.. అరెస్ట్ లు ఏవీ కనపడటం లేదు.
రఘురామ కేసులో ఎఫ్ఐఆర్ అయ్యింది.. చర్యలు తీసుకున్నది ఏం లేదు. కాకినాడ లో లక్షల టన్నుల బియ్యం పట్టుకున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ కేసు పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున జరిగిన ఇసుక అక్రమాల విషయంలో విచారణ చేస్తున్నారు గాని అది కూడా అడుగు ముందుకు పడటం లేదు. మద్యం దోపిడీకి సంబంధించి కొందరిని అరెస్ట్ చేసినా సరే మిగిలిన వారి విషయంలో ఏం చర్యలు లేవు. భూ కబ్జాల పై చర్యలు తీసుకున్నవి ఎక్కడా కనపడలేదు.
Read Also : బాబు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న ప్రకాశం వైసీపీ నాయకులు
యనమలకుదురు ఫైల్స్ దగ్ధం కేసు గాని, మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో గాని అరెస్ట్ లు ఏవీ కనపడటం లేదు. మైన్స్ అక్రమాల్లో వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసారు గాని అందులో చర్యలు ఏవీ కనపడటం లేదు. లిక్కరు కేసులో వాసుదేవరెడ్డి మీద చర్యలు లేకపోగా ఆయనకు జీతం మాత్రం వస్తోంది. జత్వాని కేసు విషయంలో అంత హడావుడి జరిగినా అది కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి లేదు. గూగుల్ టేకౌట్ లు, కాల్ హిస్టరీ, వాట్సాప్ హిస్టరీలు అన్నీ ఉన్నాయి. అయినా సరే చర్యలు తీసుకోవడానికి ఇంకా ఆలస్యం చేస్తున్నారు. చట్టం తన పని తాను చేస్తుకుంటూ వెళ్లినా ఇంత ఆలస్యం దేనికో ప్రభుత్వాధినేతలకే తెలియాలి.