Friday, September 12, 2025 11:00 AM
Friday, September 12, 2025 11:00 AM
roots

మోడీకి వెంకయ్యే పెద్ద దిక్కయ్యారా..?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆధిపత్యం బిజెపిపై పెరిగిన తర్వాత.. సీనియర్ నాయకులను పూర్తిగా పక్కన పెట్టారు. తమను అన్ని విధాలుగా ప్రోత్సహించిన సీనియర్ నాయకులను ఏమాత్రం లెక్క చేయలేదు అనే విమర్శలు చాలామంది నుంచి వినిపించాయి. ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, ఉమా భారతి, వంటి ఎందరో సీనియర్ నాయకులకు ప్రాధాన్యత లభించలేదు. అద్వానీని కనీసం నరేంద్ర మోడీ గౌరవించలేదు అనే విమర్శలు బిజెపి కార్యకర్తలు కూడా ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా చేస్తూ వచ్చారు.

Also Read : మోడీకి ఉక్కపోత.. 2012 సీన్ రిపీట్

అలాంటి నరేంద్ర మోడీ.. ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ప్రాధాన్యత ఇవ్వటం ఆశ్చర్యం కలిగించింది. ఉపరాష్ట్రపతి పదవీకాలం పూర్తయిన తర్వాత వెంకయ్య నాయుడు కేంద్ర రాజకీయాలపై పెద్దగా దృష్టి సారించలేదు. ప్రస్తుతం ఆయన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉంటూ వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్నారు. అలాంటి వెంకయ్య నాయుడుకి స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోను రావడం ఆశ్చర్యం కలిగించింది. నాలుగు రోజుల క్రితం వెంకయ్య నాయుడు ఢిల్లీ వెళ్లారు. నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళిన వెంకయ్య నాయుడు అక్కడ ప్రధానమంత్రి మోడీతో దాదాపు 45 నిమిషాల పాటు ఏకాంతంగా బేటీ అయ్యారు.

ఈ భేటీకి గల కారణాలేంటి అనేదానిపై స్పష్టత లేకపోయినా.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. ఓటర్ల లిస్టు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, అంతర్జాతీయంగా అమెరికా పెడుతున్న ఇబ్బందులు, సరిహద్దుల్లో పాకిస్తాన్ నుంచి వస్తున్న సమస్యలు, ఉపరాష్ట్రపతిగా జగదీప్ దంకర్ రాజీనామా చేయడం, బీహార్ ఎన్నికలు.. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మెడపై కత్తి మాదిరిగా వేలాడుతున్నాయి. ముఖ్యంగా రాజ్యసభలో విపక్షాలు పట్టు బిగిస్తూ వస్తున్నాయి.

Also Read : ఇలా అయితే కష్టం.. చంద్రబాబు సీరియస్..!

నెల రోజుల్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తవుతుంది. దీనితో తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేయాలి అనే దానిపై వెంకయ్య నాయుడుతో చర్చించే అవకాశం ఉండవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇదే సమయంలో ట్రంప్ వ్యవహార శైలి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేదానిపై వెంకయ్య నాయుడు సలహాలు తీసుకున్నట్లు సమాచారం. ఇక ఓటర్ లిస్టు విషయంలో కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఎలా తిప్పి కొట్టాలనే దానిపై కూడా మోడీ సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది.

రష్యా తో చేస్తున్న చమరు ఒప్పందాలను పునసమీక్షించాలి అనే అంశంలో వెంకయ్య నాయుడు సూచనలు తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక మోడీ మీడియా ముందుకు వచ్చి మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉందని.. అందుకే వెంకయ్య నాయుడుని పిలిపించారని కూడా రాజకీయ వర్గాలు అంటున్నాయి. 2014 తర్వాత మోడీ ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. మరి వెంకయ్య నాయుడు ఈ సమస్యల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని బయటపడేస్తారా లేదా అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్