ఏ పార్టీలో ఉన్నా సరే మంత్రి కావడం బొత్సా స్టైల్. పార్టీ అధికారంలో ఉంటే తన ఫ్యామిలీని ఏ విధంగా పార్టీలో కీలకం చేయాలో బోత్సాకు బాగా తెలుసు. అలాంటి బొత్సా ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ లో, వైసీపీలో బలమైన నాయకుడిగా ఒక వెలుగు వెలిగిన బొత్సా ఇప్పుడు ఉత్తరాంధ్రలో బాగా ఇబ్బంది పడుతున్నారు. పార్టీకి కీలక నేత అయినా సరే ఆయనకు అంత సౌకర్యవంతంగా వాతావరణం ఉత్తరాంధ్రలో కనపడటం లేదనే చెప్పాలి. ఇప్పుడు వైసీపీలో ఆయన శాసన మండలిలో విపక్ష నేతగా ఉన్నారు.
Also Read : అయ్యో పాపం… జగన్ పరిస్థితి ఇలా అయ్యింది ఏమిటీ…!
జగన్ కు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయనకు మండలిలో ఆ హోదా దక్కింది. ఇదంతా బాగానే ఉంది గాని… ఇప్పుడు బొత్సా గతంలో మాదిరి యాక్టివ్ గా కనపడటం లేదు. వైసీపీలో ఉండాలా వద్దా అనే సందేహంలో ఆయన బాగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీలో బొత్సాకు ప్రాధాన్యత ఉన్నా, తండ్రి లాంటి వ్యక్తి అని జగన్ చెప్పినా సరే, ఆయనకు స్వేచ్చ మాత్రం లేదు. గతంలో కాంగ్రెస్ లో స్వేచ్చగా పని చేసిన బొత్సా ఇప్పుడు ఆ స్వేచ్చ కోసం జెండా మార్చే ఆలోచనలో ఉన్నారు. ఆయనతో సన్నిహితంగా ఉండే నేతలు ఇప్పుడు జై జనసేన అంటున్నారు.
Also Read : అధినేతలకు లేని బాధ మీకెందుకు…!
త్వరలోనే ఒక కీలక నేత పార్టీ మారే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు బొత్సా కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్ళకుండా నేరుగా వెళ్ళే ఛాన్స్ ఉందని టాక్. బొత్సాకు పవన్ కు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. చిరంజీవితో బొత్సా చాలా క్లోజ్ గా ఉంటారనే టాక్ ఉంది. దానికి తోడు ఒకటే సామాజిక వర్గం కావడంతో ఆయన పార్టీ మారవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. త్వరలో కాకపోయినా వచ్చే ఏడాది మాత్రం బొత్సా ఫ్యాన్ కింది నుంచి లేచి గ్లాస్ పట్టుకునే ఛాన్స్ ఉండవచ్చు అని తెలుస్తోంది.