Saturday, September 13, 2025 12:40 PM
Saturday, September 13, 2025 12:40 PM
roots

డిక్లరేషన్ లో జగన్ దళితులను ఎందుకు లాగాడో తెలుసా?

త పదేళ్లుగా వైసీపీ రాజకీయాలు చూస్తే ఏ రూపంలో అవకాశం ఉంటే ఆ రూపంలో కులాలను, మతాలను రెచ్చగొట్టే ప్రయత్నమే ఎక్కువగా ఉంటుంది అనే మాట అక్షర సత్యం. తాను అధికారంలోకి రావడానికి కమ్మ కులాన్ని బూచిగా చూపించి ఇతర కులాల వద్ద వారిని అన్ని విధాలుగా శత్రువుగా చూపించిన జగన్ రాజకీయ లబ్ది పొందిన మాట కూడా వాస్తవమే. అమరావతి విషయంలో కూడా జగన్ చేసింది అదే. ఎస్సీ నియోజకవర్గంలో ఉన్న రాజధాని కమ్మ రాజధాని అంటూ ఆయన మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆయన పదే పదే చెప్పిన అబద్దాన్ని ప్రజలు కూడా నమ్మారు.

ఎన్నికలు వాయిదా పడినా, తనకు వ్యతిరేకంగా మీడియా ఏం రాసినా కులాన్ని రుద్దే ప్రయత్నం జగన్ గట్టిగానే చేస్తూ వచ్చారు. ఇప్పుడు చివరికి తిరుమల విషయంలో కూడా జగన్ అదే రాజకీయం చేయడం విస్మయానికి గురి చేస్తోన్న అంశం. జగన్ తిరుమల పర్యటనకు వెళ్తారు అని అధికారిక ప్రకటన వచ్చింది. ముందు కాలి నడకన అన్నారు.. తర్వాత మోకాలి నొప్పి అన్నారు.. తర్వాత నేరుగా తిరుమల అన్నారు. చివరికి అసలు పర్యటనే లేదన్నారు. ఆ తర్వాత రికార్డ్ వీడియో ఒకటి వదిలి జగన్ చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడే ప్రయత్నం చేసారు. నా మతం మానవటం అంటూ సినిమాలో చెప్పే డైలాగ్ చెప్పి తప్పించుకుందాం అనే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది. మానవత్వానికి జగన్ మాటలు వింటే చచ్చిపోతుందేమో అని ప్రజలు కామెడీ చేస్తున్నారు.

Read Also : బయటపడ్డ జగన్నాటకాలు

అందులో మాజీ ముఖ్యమంత్రిని, వైఎస్ కొడుకుని నన్నే డిక్లరేషన్ అడుగుతారా, నాకే ఇలా ఉంటే ఎస్సీలు, ఎస్టీల పరిస్థితి ఏంటీ అంటూ నిలదీశారు. అసలు డిక్లరేషన్ కు కులానికి సంబంధం ఏంటీ…? తిరుమల వెళ్తే నాకు స్వామిపై నమ్మకం ఉందని సంతకం చేయమని మాత్రమే కదా అడుగుతుంది. అంతే గాని నీది ఏ కులం, నీ గోత్రం ఏంటీ, నీ ఊరు ఏంటీ, నీ కాలనీలో ఏ కులాల వాళ్ళు ఉంటారు, నీ రాష్ట్రం ఏంటీ అని ఎవరూ అడగరు అడగలేదు. జగన్ చెప్పిన కులాల్లో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అసలు తిరుమలలో కులాల గోల ఎప్పుడూ లేదు. కాని జగన్ మాత్రం కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలను ఎప్పుడైనా తిరుమలలో ఏ ప్రభుత్వం అయినా అడ్డుకుందా…? జగన్ లడ్డు వివాదం నుంచి బయట పడటానికి కులాలను రెచ్చగొట్టే కార్యక్రమం మొదలుపెట్టారనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

పోల్స్