అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నట్టే ఉంటాయి రాజకీయాలు. అధికారం కోల్పోయిన ప్రాంతీయ పార్టీలు ఢిల్లీలో అండ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన సౌత్ లో ఈ తరహా రాజకీయం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఏపీ, తెలంగాణాలో ఈ పాళ్ళు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ అధికారం కోల్పోయారు కాబట్టి ఆయన ఢిల్లీలో పట్టు కావాల్సి ఉంది. వ్యక్తిగత విషయాలతోనే జగన్ సతమతం అవుతూ ఉంటారు. అందుకే ఆయన ఢిల్లీలో జాతీయ పార్టీలకు దగ్గర కావాలని చూస్తూ ఉంటారు.
Also Read : సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కైన రోజా
బీజేపికి ఏ విధంగా దగ్గర కావాలి అనేది జగన్ కు ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్. రాజకీయంగా టీడీపీ బలంగా ఉంది కాబట్టి, బిజెపికి టీడీపీతో అవసరం ఉంది కాబట్టి… జగన్ ఇప్పుడు ఢిల్లీ విమానం ఎక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. కుదిరితే బిజెపి లేదంటే కాంగ్రెస్ అన్నట్టే ఉంది ఆయన ధోరణి. కాని బిజెపితోనే జగన్ కు ప్రస్తుతం అవసరం ఎక్కువ. అందుకే ఏదోక రకంగా దగ్గర కావాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో కూటమిలో చీలిక తేవాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన కామెంట్స్ చేసారు. “ఇది స్థిరమైన ప్రభుత్వం, వ్యక్తులు చేసే తప్పులపై చర్యలు ఉంటాయి, కూటమిని ఎవరు చెడగొట్టలేరు అని స్పష్టం చేసారు. నేను, సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఉన్నాం. ఈ పొత్తు స్థిరమైనది, కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నాలు మమ్మల్ని ఏం చేయలేవు” సందర్భం కాకపోయినా పవన్ ఆ కామెంట్స్ చేసారు. ఇతర నేతలు మాట్లాడితే మీడియాలో పొలిటికల్ సర్కిల్స్ లో పెద్దగా హడావుడి ఉండకపోవచ్చు గాని మాట్లాడింది పవన్ కాబట్టి… చర్చ మొదలయింది.
Also Read : పర్యాటకుల కోసం ఏపీ సర్కార్ నయా ప్లాన్….!
పదే పదే బెంగళూరు వెళ్ళే జగన్… అక్కడి నుంచే బిజెపి మాజీ ఎంపీ జీవీఎల్ ద్వారా బిజెపి అధిష్టానానికి దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జీవీఎల్ కు జగన్ కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. 2018 లో ఎన్డియే నుంచి టీడీపీ బయటకు రావడంలో జీవీఎల్ ది కీ రోల్. ఇప్పుడు కాస్త మీడియాకు దూరంగా ఉన్నారు గాని… ఛాన్స్ దొరికితే గేమ్ ఆడటానికి కాచుకుని కూర్చున్నారు. జగన్ తో కూడా ఆయనకు ఏదో బంధుత్వం ఉందనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ఏపీలో బిజెపి నేతలు అందరూ టీడీపీకి దగ్గరగానే ఉన్నారు.
సో విజయసాయి పాత్రను ఇప్పుడు ఢిల్లీలో జీవీఎల్ పోషించడం మొదలుపెట్టారు. కర్ణాటక మాజీ సిఎం యడ్యూరప్పతో కూడా జగన్ ఇటీవలి కాలంలో భేటీ అయ్యారు బెంగళూరులో. ఆయనకు బిజెపి అగ్ర నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల జగన్ కలకత్తా వెళ్లినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆ పర్యటనలో కూడా ఆయన బిజెపి నేతలను కలిసినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇది గమనించే పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అంటున్నారు. అసలు ముందు జనసేనకు టీడీపీకి మధ్య చీలిక తేవాలనేది జగన్ వ్యూహంగా కనపడుతోందని తెలుస్తోంది.