మంగళగిరిలో జరిగిన టిడిపి విస్తృతస్థాయి సమావేశం తర్వాత టిడిపి ఎమ్మెల్యేలు గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు అమెరికా వెళ్లిపోవడం విషయంలో టిడిపి అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. పార్టీ అధిష్టానానికి సమాచారం ఇవ్వకుండా కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారని టిడిపి అధిష్టానం.. ఈ సమావేశంలో స్పష్టంగా వ్యక్తం చేసింది. కొంతమంది ఎమ్మెల్యేలు సమావేశానికి వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోయారని సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు.
Also Read : ఆహా.. సంస్కారవంతమైన భాష..!
మొత్తం 56 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి గైర్హాజరయ్యారని చంద్రబాబు నాయుడు స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో 15 మంది ఎమ్మెల్యేలు అలాగే ఇద్దరు ఎంపీలు పేర్లు బయటికి వచ్చాయి. ముగ్గురు నలుగురు అధిష్టానం వద్ద అదుమతి తీసుకున్నా.. మిగిలిన వారు మాత్రం అధిష్టానం వద్ద అనుమతి తీసుకోలేదని.. సమావేశానికి వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోయారని టిడిపిలో ప్రచారం జరుగుతుంది. తానా సభల పేరుతో అమెరికా వెళ్లిపోయిన కొంతమంది ఎమ్మెల్యేలు కనీసం అధిష్టానానికి సమాచారం ఇవ్వకపోవడాన్ని .. సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు నాయుడు.. వారి విషయంలో చర్యలకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read : వైసీపీ క్యూఆర్ కోడ్.. జర భద్రం గురూ..!
నియోజకవర్గంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు తక్కువగా తిరగడమే కాకుండా హైదరాబాదులో ఎక్కువగా ఉంటున్నారని.. నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు వద్ద బహిరంగంగానే చంద్రబాబు నాయుడు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ముగ్గురు మహిళ ఎమ్మెల్యేలు లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారని.. వారి డైలీ షెడ్యూల్ విషయంలో కూడా కనీసం కార్యకర్తలకు సమాచారం ఉండటం లేదని చంద్రబాబు క్లాస్ తీసుకున్నారట. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన ఎమ్మెల్యేల విషయంలో వారు తిరిగి వచ్చిన తర్వాత చర్యలకు.. రంగం సిద్ధం చేసినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి.