వెస్టిండీస్ పర్యటనకు.. భారత జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వెండిస్ పర్యటనకు సమర్థవంతమైన జట్టు ఎంపిక చేసేందుకు.. దాదాపు 20 రోజుల నుంచి కసరత్తు చేస్తోంది సెలక్షన్ కమిటీ. ముందు కెప్టెన్ శుభమన్ గిల్ కు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. వెస్టిండీస్ పర్యటనకు సీనియర్ ఆటగాడిని కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉండొచ్చు అంటూ ప్రచారం జరిగింది. అయితే గిల్ ఫిట్ గా ఉండటంతో.. విండీస్ పర్యటనకు కెప్టెన్ గా ఎంపిక చేశారు. అటు రిషబ్ పంత్ కు రెస్ట్ ఇచ్చి రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్ చేశారు.
Also Read : 41 ఏళ్ల ఆసియా కప్ లో సరికొత్త చరిత్ర
అయితే జట్టు నుంచి కొంతమంది ఆటగాళ్లను తప్పించడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు జట్టులో అవకాశం కల్పించని ఆటగాళ్లపై సెలక్షన్ కమిటీ అనుసరించిన వైఖరిని తప్పుపడుతున్నారు క్రికెట్ అభిమానులు. 2022లో జాతీయ జట్టుకు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్ ఇప్పటివరకు అరంగేట్రం చేయలేదు. ప్రతి సిరీస్ కు అతనిని ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. కానీ తుది జట్టులో అవకాశం ఇచ్చే విషయంలో మాత్రం.. మొండి చేయి చూపుతున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్న సమయంలో కూడా అతనికి జట్టులో అవకాశం కల్పించలేదు.
Also Read : బాలయ్య మాటల మంటలు.. టీడీపీ వర్సెస్ మెగా ఫ్యాన్స్
న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో అతనిని ఎంపిక చేశారు. కానీ జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఇక ఆస్ట్రేలియా పర్యటనతో పాటుగా ఇంగ్లాండ్ పర్యటనకు కూడా అతను ఎంపిక అయ్యాడు. దేశవాళి క్రికెట్ లో టన్నులు కొద్ది పరుగులు చేసిన సరే.. జట్టులో చోటు కల్పించడం లేదు. కానీ తాజాగా విండీస్ పర్యటనకు అతనిని పక్కన పెట్టింది సెలక్షన్ కమిటీ. అసలు అవకాశం ఇవ్వకుండా అతనిని ఏ విధంగా పక్కన పెడతారంటూ అభిమానులు మండిపడుతున్నారు. సెకండ్ వికెట్ కీపర్ విషయంలో కేఎల్ రాహుల్ ఉన్నా సరే.. తమిళనాడుకు చెందిన నారాయణ జగదీష్ ను.. ఎంపిక చేశారు సెలెక్టర్లు. అటు అర్షదీప్ సింగ్ కూడా జట్టులోకి చోటు కోల్పోవడం.. ఆశ్చర్యం కలిగిస్తుంది. అతనికి కూడా ఇంగ్లాండ్ పర్యటనలో అవకాశం కల్పించలేదు.