టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో.. తర్వాతి కెప్టెన్ ఎవరు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. బోర్డ్ పెద్దల ఆశీర్వాదం ఎవరికి ఉందనే దానిపై అసలు స్పష్టత రావడం లేదు. వచ్చే వారం.. ఇంగ్లాండ్ పర్యటనకు జట్టు ఎంపిక ఉన్న నేపధ్యంలో.. రోహిత్ శర్మ తప్పుకోవడంతో ఎవరికి అవకాశం లభిస్తుందనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రోహిత్ శర్మ స్థానంలో ఎక్కువగా ముగ్గురి పేర్లు వినపడుతున్నాయి. గంభీర్ కూడా ఆ ముగ్గురిలోనే ఓ పేరు చెప్పినట్టు సమాచారం.
Also Read : ఆపరేషన్ సక్సెస్.. దెబ్బ అదుర్స్..!
ఇంగ్లాండ్ పర్యటనకు గానూ.. కెఎల్ రాహుల్, శుభమన్ గిల్, బూమ్రా.. ఈ ముగ్గురిలో ఒకరికి సారధ్య బాధ్యతలు అప్పగించే అవకాశం కనపడుతోంది. కెఎల్ రాహుల్ వైపే బోర్డ్ పెద్దలు చూస్తున్నట్టు జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. టెస్ట్ క్రికెట్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న రాహుల్ అయితే బాగుంటుందని గంభీర్ కూడా అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. వాస్తవానికి బూమ్రా ముందు ఉన్నా సరే.. అతనిలో నాయకత్వ లక్షణాలు తక్కువ. దానికి తోడు అతనిలో ఉన్న వ్యక్తిగత దూకుడు కూడా నాయకత్వానికి సరిపడదనే భావన ఉంది.
Also Read : జగన్ ఇంటి తలుపు తట్టిన లిక్కర్ స్కామ్
గాయాల సమస్య కూడా అతనికి ఎక్కువ. ఫాస్ట్ బౌలర్లకు ఉండే సమస్య అదే. కెఎల్ రాహుల్ కు ఐపిఎల్ తో పాటుగా జాతీయ జట్టుకు సారధ్యం వహించిన అనుభవం కూడా ఉంది. శుభమన్ గిల్ విషయానికి వస్తే.. యువ ఆటగాడు కావడం ఇతనికి కాస్త కలిసి వచ్చే అంశమే అయినా.. టెస్ట్ క్రికెట్ లో అనుభవం తక్కువ. అయితే ఐపిఎల్ లో గుజరాత్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. జాతీయ జట్టులో.. వైస్ కెప్టెన్ గా అనుభవం కూడా ఉంది. రాహుల్ మరో 4 ఏళ్ళ పాటు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. కాబట్టి రాహుల్ ను ప్రస్తుతం ఎంపిక చేసి ఆ తర్వాత.. గిల్ ను ఎంపిక చేయవచ్చనేది క్రీడా పండితుల అభిప్రాయం.




