Saturday, September 13, 2025 07:06 AM
Saturday, September 13, 2025 07:06 AM
roots

వర్మను దాచిన హీరో ఎవరు…?

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పోలీసుల విచారణకు హాజరు కావాలంటేనే భయపడిపోతున్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హీరోలా చెలరేగిన వర్మ ఇప్పుడు జీరో అయిపోయాడు. రెండుసార్లు సమయం ఇచ్చినా విచారణకు హాజరు కాని వర్మ.. అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. దీంతో ప్రజలు, పోలీసులు వర్మ పరారీలో ఉన్నాడని నిర్ణయించుకున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ల విషయం తేలే వరకు బయటకి రాకపోవచ్చు. వర్మ కోసం పోలీసులు నిన్న ఉదయం నుంచి గాలిస్తున్నారు. ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసిన వర్మ.. ఆచూకీ కోసం ఏపీ పోలీసులు సాంకేతికత కూడా ఉపయోగిస్తున్నారు. రెండు బృందాలుగా హైదరాబాద్ లో గాలిస్తున్నారు.

Also Read : బాబు టార్గెట్ అదే… బీ కేర్ ఫుల్..!

ఇక మరో రెండు బృందాలు తమిళనాడులోని కోయంబత్తూరుకు పంపించారు. హైదరాబాద్లోనే ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వర్మ సోషల్ మీడియా ఖాతాల ఐపీ అడ్రస్ లు హైదరాబాద్ లోనే చూపిస్తున్న నేపధ్యంలో… అతని సన్నిహితులపై ఫోకస్ చేసారు. ఓ ప్రముఖ హీరో వర్మకు ఆశ్రయం కల్పిస్తున్నట్టు గుర్తించినట్టు వార్తలు వస్తున్నాయి. శంషాబాద్, షాద్ నగర్లోని 2 ఫాంహౌస్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈరోజు సాయంత్రానికి వర్మను ఎలా అయినా అరెస్ట్ చేయాలని పోలీసులు అడుగులు వేస్తున్నారు.

Also Read : డీఎస్పీతో మైత్రీ కట్..!

వర్మ కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వర్మపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లు పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరగనుంది. సోషల్ మీడియా వేదికగా అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని పోలీసులు కేసు నమోదు చేసారు. ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసాడు వర్మ. ఈరోజు హైకోర్టులో ఈ పిటిషన్లు విచారణకు రానున్న నేపథ్యంలో, వాటి సంగతి తేలే వరకు పోలీసులతో వర్మ దోబూచులాటలు తప్పేట్లు లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్