మన భారత్ లో ఉల్లిపాయలు లేని వంట గది దాదాపుగా ఉండదు. ఎక్కువగా ఎర్ర ఉల్లిపాయలు.. అలియాస్ రెడ్ ఆనియన్ ఎక్కువగా మన వంట గదుల్లో కనపడుతూ ఉంటుంది. కొందరు దేశీ ఉల్లిపాయలు కూడా వాడుతూ ఉంటారు. మరి ఏ ఉల్లిపాయ మంచిది..? అనేది ఈ స్టోరీలో చూద్దాం. కూరలు, బిర్యానీలు లేదా రోజువారీ వంటలు, అయినా, ఉల్లిపాయలు రుచికి మూలాధారం. ఇక ఉల్లిపాయలు మన శరీరంలో ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కూడా చూపిస్తాయి. బయోయాక్టివ్ సమ్మేళనాలను ఉల్లి కలిగి ఉంటుంది.
Also Read : బూతులు తిడితే నెలకు లక్ష.. నాగార్జున యాదవ్ కు జగన్ గిఫ్ట్
అలసట, ఉబ్బరం, దీర్ఘకాలిక నొప్పి వెనుక ఉన్న అంతర్గత ప్రతిచర్యలకు పరిష్కారం చూపిస్తూ ఉంటుంది. మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. 2021 పరిశోధనల ప్రకారం ఉల్లిపాయలలోని క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలను సహజ శోథ నిరోధకాలుగా పని చేస్తాయి అని తేల్చారు. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి. కాబట్టి, ఉల్లిపాయలు రుచికి పునాది అయినప్పటికీ, అవి నిశ్శబ్దంగా మీ ఆరోగ్య వ్యవస్థను అదుపులో ఉంచుతాయి.
మన ఇళ్ళల్లో ఎక్కువగా దేశీ ఉల్లిపాయలు కనపడతాయి. దేశీ ఉల్లిపాయలలో ఆంథోసైనిన్లు, క్వెర్సెటిన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే యాంటీఆక్సిడెంట్లుగా చెప్తారు. ఉదాహరణకు, దగ్గు నుండి ఉపశమనం పొందడానికి, తేనెతో చూర్ణం చేసిన దేశీ ఉల్లిపాయను కలపడం లేదా కీళ్ల నొప్పులను తగ్గించడానికి పచ్చివి తినడం వంటివి చేస్తారు. ఉల్లిపాయలు ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read : ఒరిజినల్ పాన్ ఇండియా మూవీ.. కలెక్షన్స్ లో కాంతారా సరికొత్త రికార్డులు..!
ఎర్ర ఉల్లిపాయల విషయానికి వస్తే, విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునే ఈ ఉల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. 2019లో ప్రచురితమైన పరిశోధనలో ఎర్ర ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్, ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉన్నాయని గుర్తించారు. 2013 నాటి మరో పరిశోధనలో ఈ యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలు కంట్రోల్ చేస్తాయి. ఇవి జీర్ణం కావడంలో సులువుగా ఉంటాయి. అయితే రెండు ఉల్లిపాయలు మంచివే అంటున్నారు నిపుణులు. దేశీ ఉల్లిపాయలు వండిన భోజనానికి రుచిని తీసుకొస్తాయి. ఎర్ర ఉల్లిపాయలు తాజాదనాన్ని, పోషణను అందిస్తాయి. రెండింటినీ ఉపయోగించడం వల్ల పోషకాలు, రుచి దొరుకుతాయి. రెండిటిలో మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా మంచిదే అంటున్నారు పరిశోధకులు.