Saturday, September 13, 2025 06:23 AM
Saturday, September 13, 2025 06:23 AM
roots

ఆనాడు ఈ మానవతావాదులు ఎక్కడున్నారు?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదులపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్న ఉన్మాదుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్ళు చూసి చూడనట్టు వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సీరియస్ గానే అడుగులు వేస్తోంది. ఇంటూరి రవి కిరణ్, వర్రా రవీంద్రా రెడ్డి, కళ్ళం హరిక్రిశ్నా రెడ్డి సహా పలువురు ఉన్మాదుల విషయంలో సీరియస్ గానే వ్యవహరించారు. ఇక పెద్దిరెడ్డి సుధారాణి, వెంకటేశ్వర రెడ్డి వంటి వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Also Read : ఆ పదవి కోసం ఎందుకంత పోటీ..?

పోలీసుల సహకారంతో… ఇన్నాళ్ళు తప్పించుకుని తిరిగిన వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు నిన్న మీడియా ముందు ప్రవేశ పెట్టారు, సోమవారం రాత్రి వర్రాను జడ్జి ముందు హాజరు పరచగా తనను పోలీసులు హింసించారు అని వర్రా కన్నీటి పర్యంతం అయ్యాడట. ఆ వ్యాఖ్యలను పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. ఈ సందర్భంగా కొందరు మానవతా వాదులు… కార్యకర్తలను హింసించడం ఏంటీ నాయకులు ఇబ్బందులు పెడితే, నాయకుల కుట్రలో కార్యకర్తలను భాగస్వాములను చేస్తారా వారిని హింసిస్తారా అంటూ మాట్లాడుతున్నారు.

Also Read : ముగిసిన 9 ఏళ్ల విస్తారా ప్రస్థానం..!

గత ప్రభుత్వంలో పోలీసుల ప్రవర్తన, ఆ కన్నీళ్లు పెట్టె వారి ప్రవర్తన, నాయకుల ప్రవర్తన చూసి మౌనంగా ఉన్న మానవతావాదులు ఇప్పుడు నోరు తెరవడం ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్ లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా ఉగ్రవాదుల మాదిరి వారిని తీసుకొచ్చి హింసించి, వారి ల్యాప్టాప్ లు, ఫోన్ లు వగైరా లాక్కుని… వాటిని వైసీపీ కార్యకర్తలకు ఇచ్చి సోషల్ మీడియాలో వర్క్ చేయించారు. కెమెరాలు, కంప్యూటర్ లు కూడా లాక్కున్న సందర్భాలు ఉన్నాయి. కొందరిని కారులో పోలీసులు కొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. సాక్షాత్తు ఓ ఎంపీని కస్టడీలో హింసించారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఆయన స్వయంగా తన కాళ్ళను కూడా చూపించారు. అయినా సరే అప్పుడు ఈ మానవతావాదులు మౌనంగా ఉండి ఇప్పుడు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్