Friday, September 12, 2025 07:25 PM
Friday, September 12, 2025 07:25 PM
roots

ఇంత జరుగుతున్నా తండ్రి కొడుకులు ఎక్కడా…?

సజ్జల రామకృష్ణారెడ్డి… ఒకప్పుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా వినపడేది. ఒక సలహాదారు ప్రభుత్వాన్ని శాసించటం అప్పట్లో సంచలమైనది. మంత్రులతో సమీక్షలు నిర్వహించడం.. ఆ తర్వాత మీడియా సమావేశాలు పెట్టి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం.. మంత్రులకు ఆదేశాలు ఇవ్వడం, ఎమ్మెల్యేలను ఏం చేయాలో చెప్పడం వంటివి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో పెద్ద ఎత్తున చేశారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఒంటి చేత్తో నడిపించారు.

Also Read : జగన్ పై నమ్మకం లేదా…? సీరియస్ గా తీసుకోని లీడర్లు

అయితే ఇప్పుడు వైసీపీ నేతలను.. ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన వారిని అరెస్టు చేస్తున్నా.. సజ్జల మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఆయన ఎక్కడున్నారో కూడా కనీసం పార్టీ కార్యకర్తలకు కూడా సమాచారం లేదు. అటు వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలతో కూడా ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి టచ్ లో లేరు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇలా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరూ.. పార్టీ క్యాడర్ ను వదిలేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

Also Read : ఒంటిపూట బడులపై ఏపీ సర్కార్ క్లారిటీ..!

ఒకప్పుడు పార్టీలో ప్రభుత్వంలో అన్ని తానై వ్యవహరించిన సజ్జల.. ఇప్పుడు ఇలా పార్టీ నేతలపై వరుస కేసులు నమోదు అవుతున్నా.. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో అర్థం కాని పరిస్థితి వున్నా సరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదు. పార్టీలో కూడా ఆయనకు కీలక పదవి కట్టబెట్టారు వైయస్ జగన్. ఒకప్పుడు వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శలు చేసిన ఆయన.. ఇప్పుడు కనీసం ఒక్కటంటే ఒక్క మాట కూడా మీడియా ముందుకు వచ్చి అధికార పార్టీని తిట్టే ప్రయత్నం చేయలేకపోతున్నారు. ఇక ఆయనపై కూడా వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో సజ్జల భార్గవ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి ఇద్దరు తమను తాము కాపాడుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్