Tuesday, October 28, 2025 01:43 AM
Tuesday, October 28, 2025 01:43 AM
roots

పదవులిచ్చారు.. ఆ తర్వాత ఏమయ్యారు వాళ్లు..?

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నేతలు పదవుల కోసం ఆశపడ్డారు. అందులో కొంతమందికి టీడీపీ అధినేత చంద్రబాబు పదవులిచ్చారు కూడా. అయితే అందులో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ఏమయ్యారో కూడా తెలియటం లేదు. దీంతో టీడీపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 30 మందికి ప్రభుత్వం కార్పొరేషన్ పదవులిచ్చింది. పోస్ట్ వచ్చిన వాళ్లంతా కూడా పదవులు చేపట్టారు. అంతే… ఆ తర్వాత ఏమయ్యారో తెలియటం లేదు. పట్టాభి, జీవీ రెడ్డి, నీలయపాలెం విజయ్, ఆనం వెంకట రమణ రెడ్డి మినహా మిగిలిన వారు ఎక్కడున్నారో… ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదనేది తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్న మాట.

Also Read : కూటమి నేతలకు ఎగ్జాం టైం.. 20 రోజుల్లో పాస్ అవ్వాలి…!

ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి చేపట్టిన మంతెన రామరాజు… కనీసం కార్యాలయానికి కూడా వచ్చినట్లు లేదంటున్నారు. ఇక మరో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ అయితే… ఆయనకు కేటాయించిన అర్బన్ డెవలప్‌మెంట్, ఫైనాన్స్ కార్పొరేషన్‌ ఏం పనిచేస్తుందో కూడా తెలియదంటున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ పదవి చేపట్టిన కొనకళ్ల నారాయణ తన అనారోగ్య కారణాలతో ఇప్పటివరకు ఆర్టీసీ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు అని తెలుస్తుంది. ఇక మహిళా కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి చేపట్టిన కావలి గ్రీష్మ అయితే… ఏమయ్యారో కూడా తెలియటం లేదు. శాప్ ఛైర్మన్ ‌రవినాయుడు తిరుగుతున్నప్పటికీ… వైసీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన అవినీతిపై ఇంకా ఎలాంటి దృష్టి పెట్టలేదు. అసలు క్రీడాభివృద్దికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా ఇప్పటి వరకు చెప్పలేదు.

Also Read : ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ఖరారైతే తిరుగులేదు

స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభి మాత్రం ఇప్పటిక నాగ్‌పూర్ సహా ఇతర నగరాల్లో క్లీన్ అండ్ గ్రీన్ ఎలా అమలవుతుందో అని అధ్యయనం చేశారు. అలాగే ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి అయితే మరో అడుగు ముందుకు వేశారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమ నియామకాలపై ఉక్కుపాదం మోపారు. ఏకంగా 410 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. అలాగే వ్యూహాం సినిమాకు జరిగిన అక్రమ చెల్లింపులపై ఇప్పటిక దర్శక నిర్మాతలకు నోటీసులు జారీ చేసారు. నీలయపాలెం విజయ్ మరియు అనం వెంకట రమణారెడ్డి వైసీపీ అవినీతిని బయటపెట్టడంలో నిత్యం పార్టీకి సహాయసహకారాలు అందిస్తున్నారు. ఇలా పనిచేసేందుకు మిగిలిన కార్పోరేషన్ చైర్మన్‌లకు ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్