Tuesday, October 28, 2025 07:28 AM
Tuesday, October 28, 2025 07:28 AM
roots

ఇంకెన్నాళ్లు ఈ సాగదీత..? టీటీడీపీ భవిష్యత్తు ఏంటీ..?

2014 ముందు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అప్పట్లో బలపడేందుకు తెలుగుదేశం పార్టీతో పాటుగా ఇతర పార్టీలను ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే సమయంలో టిడిపి కొన్ని కారణాలతో తెలంగాణలో ఎక్కువగా దృష్టి పెట్టలేక పార్టీని వదిలేసిన పరిస్థితి. అయితే చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడిన ప్రతిసారి తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నామని చెబుతూ వచ్చారు.

Also Read : జగన్ మాస్టర్ ప్లాన్ రెడీ.. బీ అలర్ట్..!

తెలంగాణలో ఎన్నో మార్పులను శ్రీకారం చుట్టిన టిడిపి ఇప్పుడు అక్కడ ఫోకస్ చేయలేకపోవడం కార్యకర్తలను మరింత ఇబ్బందికి గురిచేస్తుంది. ఇప్పటివరకు 2004 తర్వాత తెలంగాణలో అధికారం లేకపోయినా సరే కార్యకర్తలు మాత్రం ఆ పార్టీ జెండాను మోస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే 2014 నుంచి పార్టీపై ఫోకస్ పెడతామని టిడిపి అధిష్టానం చెబుతున్న ఇప్పటివరకు నాయకత్వాన్ని బలోపేతం చేయలేదు. కీలక నాయకులు పార్టీలు మారి మంత్రులు ముఖ్యమంత్రులు అయిన సందర్భాలు ఉన్నాయి.

Also Read : అమరావతి గెజిట్ సాధ్యమేనా..?

ఇక 2024లో ఆంధ్రప్రదేశ్ లో టిడిపి అధికారంలోకి వచ్చిన సమయంలో తెలంగాణపై ఫోకస్ పెట్టబోతోందని అలాగే కొంతమంది గులాబీ పార్టీ నాయకులు టిడిపి కండువా కప్పుకోబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క నాయకుడు టిడిపి కండువా కప్పుకోలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటుగా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నా సరే టిడిపి అధిష్టానం మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేకపోతోంది.

Also Read : ఇంగ్లీష్ టూర్‌కు ఆ ముగ్గురూ ఫిక్స్..?

అటు భారత రాష్ట్ర సమితి క్రమంగా బలహీనపడే సంకేతాలు కనపడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న.. బిజెపి కాస్త దూకుడుగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్న సరే టిడిపి మాత్రం మౌనంగానే ఉంటుంది. కనీసం ఉన్న నాయకత్వానికి పదవులను కూడా ఈ ఇవ్వకుండా కాలయాపన చేయడం కార్యకర్తలకు ఏమాత్రం నచ్చటం లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు ముందడుగు పడటం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్