Friday, September 12, 2025 04:59 PM
Friday, September 12, 2025 04:59 PM
roots

కండలు కరగకుండా బరువు తగ్గాలంటే.. ఇవి ఫాలో అవ్వండి..!

బరువు తగ్గే సమయంలో కొందరు కండరాలను (కండలను) కూడా కోల్పోతూ ఉంటారు. బరువు తగ్గే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇలా జరుగుతూ ఉంటుంది. కేలరీలు తగ్గించే క్రమంలో శరీరానికి కొన్నిసార్లు ప్రోటీన్ లు అందించే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ సమయంలోనే కండరాలు కరిగిపోతూ ఉంటాయి. వేగంగా బరువు తగ్గే సమయంలో ఇది మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కొవ్వును కరిగించాలి అనుకున్నప్పుడు సరైన పోషకాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: జంప్ డిపాజిట్… నయా సైబర్ క్రైమ్..!

కండరాల నష్టం లేకుండా బరువు తగ్గడానికి కొన్ని చిట్కాలు ఒకసారి చూస్తే. వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్‌ లు, పుష్-అప్‌ లు లేదా బాడీ వెయిట్ వర్కౌట్‌ లు వంటి వ్యాయామాలు చేసే సమయంలో కేలరీలు ఎక్కువగా కరుగుతూ ఉంటాయి. ఇలా చేసే సమయంలో శరీరంలోని అన్ని ప్రధాన కండరాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రధాన కండరాలు అన్నిటిని వ్యాయామంలో భాగం చేయాల్సి ఉంటుంది. వారంలో ఇలా 3 నుంచి 4 సార్లు చేయాల్సి ఉంటుంది. తగినన్ని ప్రొటీన్లను తీసుకోవాలి. ప్రోటీన్ అనేది కండరాలు పెరగడానికి ఉపయోగపడుతుంది.

Also Read: తక్కువ నిద్రపోతున్నారా..? అయితే గుండెపోటు గ్యారెంటీ..!

కండరాల నష్టాన్ని నివారించడానికి, ప్రతిరోజూ ఒక కిలోగ్రాము శరీర బరువుకు తగ్గట్టు.. 1.2-2.0 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. మాంసాలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, చిక్కుడు కాయలు వంటి అధిక-ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొవ్వు తగ్గడాన్ని ప్రోత్సహిస్తూ.. కండరాల పెరుగుదలకు ఇవి సహకారం అందిస్తాయి. కేలరీలను విపరీతంగా తగ్గించడం మంచిది కాదు. దీనితో కండరాలు ఎక్కువగా కరిగిపోతాయి. రోజుకు 300–500 కేలరీలను మాత్రమే కరిగించడం మంచిది. ఇలా చేస్తే కొవ్వు సరిపడా కరుగుతుంది. రోజులో తీసుకునే భోజనంలో ప్రోటీన్ ఆహారం ఉండటం మంచిది. ఓవర్‌ ట్రైనింగ్ తీసుకున్నా సరే ఇబ్బందులు తప్పవు. సరైన నిద్ర ఉండాలి. అవోకాడోలు, గింజలు, గింజలు, ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలను తీసుకోవడం మంచిది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్