ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటనలు అంటే భారత ఆటగాళ్లకు సవాల్. ఉపఖండ పరిస్థితులకు అలవాటు పడిన ఆటగాళ్ళు అక్కడ అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. కాని ఇంగ్లాండ్ పర్యటనలో మాత్రం ఈసారి భారత్.. తప్పులు మినహా మంచి ప్రదర్శనే చేయడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. నాలుగో టెస్ట్ డ్రా చేసుకున్న విధానం చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ ఆట తీరుకు క్రికెట్ విమర్శకులు సైతం జై కొట్టారు.
Also Read : ప్లీజ్ సేవ్ మీ.. ఈ ఒక్కసారికి..!
నాలుగో రోజు, రెండో ఇన్నింగ్స్ లో భారత్ చేసిన పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. పరుగుల ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ను రాహుల్ – గిల్ జోడీ ఆదుకుంది. 5 వ రోజు తొలి సెషన్ లో ఇద్దరూ అవుట్ కాగా, ఆ తర్వాత జత కలిసిన సుందర్, జడేజా ఇంగ్లాండ్ విజయాన్ని లాగేసుకున్నారు. ముఖ్యంగా సుందర్.. అద్భుతమైన టెక్నిక్ తో చరిత్రలో నిలిచిపోయే సెంచరీ చేసాడు. ఇంగ్లాండ్ ఎన్ని వ్యూహాలతో బౌలింగ్ చేసినా అది ఫలించలేదు. మొత్తం 206 బంతులు ఆడిన సుందర్.. డిఫెన్స్ తో పాటు స్ట్రైక్ రొటేట్ కు కూడా ప్రాధాన్యత ఇచ్చాడు.
Also Read : సింగపూర్ లో చంద్రబాబు.. టార్గెట్ ఇదే
ఈ ఇన్నింగ్స్ చూసిన క్రికెట్ అభిమానులు ఓల్డ్ ట్రాఫోర్డ్ లో సచిన్ తొలి సెంచరీ గుర్తు చేసుకుంటున్నారు. ఆ టెస్టులో, ఇంగ్లాండ్ ముందు బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 519 పరుగులు చేయగా.. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 87 పరుగుల లీడ్ తో నిలబడింది. మళ్ళీ ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో దూకుడుగా బ్యాటింగ్ చేసి 408 పరుగుల టార్గెట్ ఇవ్వగా.. భారత్ తడబడింది. 6వ స్థానంలో బ్యాటింగ్ చేసిన 17 ఏళ్ళ సచిన్ 189 బంతుల్లో 17 ఫోర్ల సహాయంతో 119 పరుగులు చేసి డ్రా చేసాడు. మనోజ్ ప్రభాకర్ తో కలిసి 183 పరుగులకే ఆరు వికెట్ కోల్పోయిన భారత్ ను డ్రా దిశగా నడిపించాడు. ఏడో వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇద్దరూ. అది సచిన్ తొలి సెంచరీ కాగా, సుందర్ కూడా ఇప్పుడు తొలి సెంచరీతోనే ఆకట్టుకున్నాడు.