Wednesday, February 4, 2026 11:05 AM
Wednesday, February 4, 2026 11:05 AM

బీసీ నేతకు షాక్ ఇచ్చింది బీసీ ఓటర్లే నా!!

శత్రువులు ఎక్కడో వుండరు.. మన ఇంట్లోనే, చెల్లెళ్లు, కూతుళ్ల పుట్టి, మన చుట్టూనే తిరుగుతుంటారు.. అనే డైలాగ్ అఆ సినిమాలో తండ్రి పాత్రదారి రావు రమేష్ ఆవేదనతో, బాధతో చెప్పినా.. అప్పట్లో నవ్వు వచ్చింది. కానీ ఇందులో చాలా లోతైనా అర్థం ఉంది. ఒక కుటుంబంలో యూనిటీ లేదన్నదీ దాని అర్ధం. అలాగే ఒకటి, రెండు కులాల్లో ఉండే, యూనిటీ మిగిలిన కులాల్లో ఉండదని అనేక ఎన్నికల్లో రుజువైంది. తాజాగా సాక్షాస్తూ రాష్ట్ర పాలనకు గుండె కాయలాంటి సచివాలయంలో జరిగిన ఎన్నికల ఫలితాలతో బయట పడింది. ఎస్సీ, ఎస్టీ కులంలో ఉన్న యూనిటీ, బీసీ కులంలో ఉండదని, బీసీ కులాల ఓటర్లే, ఓట్లు రూపంలో రుజువు చేశారు. మేము బీసీలమే.. కానీ బీసీ వర్గాల్లో ఎన్నెన్నో కులాలు ఉంటాయి. కాబట్టి బీసీలందరూ ఒకే కులం అనుకుంటే అందరూ పప్పులో కాలు వేసినట్లే.. మా బీసీల్లో చాలా కులాలుంటాయని ఆచరణలో చూపారు. బీసీ అనేది ఒకే ఒక కులం కాదు, ఎన్నో కులాలుంటాయని వివిధ హోదాల్లో ఉన్న బీసీ అధికారులు, ఉద్యోగులు రుజువు చేశారు.

Also Read : బ్రేకింగ్: గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్..!

మా కులం వారికి మాత్రమే ఓట్లు వేస్తాం, మరొక కులం వారికీ ఓటు వేయాలని లేదుగా, మాకు వర్గం కన్నా, అవసరాలే మిన్న అని బీసీ కులాల ఓటర్లు భావించారేమో!! నమ్మరేమో!! ఇక అసలు విషయానికోస్తే.. అమరావతి సచివాలయం ఉద్యోగ సంఘం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య జరిగిన పోటీలో బలమైన వర్గం అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు. అధ్యక్షుడుగా బీసీ వర్గానికి చెందిన అధికారి పోటీ చేయగా, ఎస్సీ వర్గం నుండి మరొకరు పోటీ చేశారు. దీనితో ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓటర్లందరూ ఏకమయ్యారు. అదే విధంగా బీసీ వర్గాల ఓటర్లందరూ ఏకమైవుతారు.. కాబట్టి.. బీసీ అభ్యర్థి గెలుపు ఖాయం.. మెజారిటీ ఎంత అన్న ప్రచారానికి, బీసీ ఓటర్లే బ్రేకులు వేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లందరూ ఏకమై, అధ్యక్షుడిగా పోటీ చేసిన, ఎస్సీ అభ్యర్థికి ఓట్లు వేయగా, బీసీ ఓటర్లు మాత్రం బీసీ అభ్యర్థికి ఓట్లు వేయకుండా, ఎస్సీ అభ్యర్థికి ఓట్లు వేయటంతో.. ఆయన అఖండ మెజారిటీతో విజయం సాధించారు. బీసీ అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు.

Also Read : చంద్రబాబు నాయుడు – గ్రీన్‌ఫీల్డ్ ఆర్కిటెక్ట్

ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉన్న యూనిటీ, బీసీ వర్గాల్లో లేదనే చర్చ ఇప్పుడు సచివాలయ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. మా బీసీలందరూ ఒకటే.. రెండు, మూడు కులాలకు సంబంధించిన వారు కాదు.. మేము 30 కులాలకు చెందిన వారం.. అని బీసీ అధికారుల ఓటర్లే ఓట్లు రూపంలో సచివాలయంలో రుజువు చేశారు. దీన్ని బట్టి బీసీ వర్గం అనేది ఒక కులానికి సంబంధించిన అంశం కాదు.. చాలా చాలా చాలా కులాలుంటాయనే తత్వం ఇప్పుడు బోధపడుతోంది. ఎస్సీ, ఎస్టీల్లో ఉన్న యూనిటీ మా బీసీల్లో ఉండదని సచివాలయం ఉద్యోగ సంఘం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో బయట పడింది. నిజానికి బీసీల్లో నాలుగు గ్రూపులుంటాయి. ఒక గ్రూపు చెందిన వారికీ మరో గ్రూప్ చెందిన వారికి ఉద్యోగాల్లో అర్హత ఉండదో, అదే విధంగా తమ బీసీ అభ్యర్థి గురించి అలాగే ఆలోచించారేమో అనే చర్చ వినిపిస్తోంది. సచివాలయంలో నిప్పులా మండుతున్న ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌ల ప్రభావం కూడా ఎక్కడా పనిచేసినట్లు కన్పించలేదు. ఎస్సీ, ఎస్టీల్లో వున్న యూనిటీ, బీసీల్లో ఉండదని బీసీ వర్గాల అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్