Tuesday, October 21, 2025 07:20 PM
Tuesday, October 21, 2025 07:20 PM
roots

కూటమి ఎంపీ, ఎమ్మెల్యే మధ్య క్రెడిట్ వార్..!

చేసిన పనిని గొప్పగా చెప్పుకుంటారు. ఇక రాజకీయ నాయకుల గురించి అయితే ఈ మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చేయని పనులను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు తెగ ఆరాట పడుతుంటారు. అయితే ఇప్పుడు ఏపీలో మాత్రం కూటమికి చెందిన ఓ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇంకా చెప్పాలంటే.. పని జరగక ముందే.. నా వల్లే జరిగింది అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు కూడా.

నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు మధ్య వివాదం చాపకింద నీరు మాదిరిగా మారింది. ఇద్దరు నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. పైగా కూటమిలో భాగస్వామ్యులు కూడా. అయినా సరే.. ఇద్దరు నేతల మధ్య క్రెడిట్ వార్ జరుగుతోంది. ఇదంతా కేవలం ఒక రైలు పొడిగింపు వల్ల మొదలైంది. అసలు ఈ వివాదానికి కారణం ఇద్దరికీ జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండటమే అంటున్నారు విశ్లేషకులు.

Also Read : విదేశీ డాక్టర్ లకు ట్రంప్ గుడ్ న్యూస్..?

చెన్నై – విజయవాడ – చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నరసాపురం వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం ఈ రైలు విజయవాడకు ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుని.. తిరిగి 3 గంటలకు చెన్నై బయలుదేరి వెళ్తోంది. అయితే 3 గంటల పాటు ఇలా ప్లాట్‌ఫామ్ పైనే ఖాళీగా ఉంచటం వల్ల మిగిలిన రైళ్లకు ఇబ్బంది కలుగుతోంది. అదే సమయంలో ఈ రైలు భీమవరం వరకు పొడిగించాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. అయితే భీమవరం రైల్వేస్టేషన్‌లో వాటర్ ఫిల్లింగ్ లేకపోవడంతో నరసాపురం వరకు పొడిగించాలని భావించారు. అయితే అలా పొడిగించటం వల్ల రైలు వేళల్లో మార్పులు చేయాల్సి వస్తుందన.. దీని వల్ల మిగిలిన రైళ్లపై కూడా ఆ ప్రభావం పడుతుందని అధికారులు గుర్తించారు. దీంతో రైలు వేళల్లో మార్పులు చేసి కొత్త టైంటేబుల్ ప్రకటించాల్సి ఉంది.

అయితే ఇప్పుడు ఈ పొడిగింపు అంశంపై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మధ్య ఆధిపత్య పోరుకు కారణమైంది. “చెన్నై – విజయవాడ వందే భారత్ రైలు సర్వీసును భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించాలని కోరుతూ మిత్రులు, రైల్వే కమిటీ ఛైర్మన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ గారికి లేఖ రాశాను. ఈ సర్వీసు పొడిగించడం వలన నరసాపురం, భీమవరం పరిసర ప్రాంతాలకు వేగవంతమైన రవాణా అందుతుందని, విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు ఉపయోగపడుతుందని అలాగే రైలు ఆక్యుపెన్సీ కూడా పెరిగే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నాను. ఈ అభ్యర్ధనను మరో 10 రోజులలో క్లియర్ చేస్తామని సీఎం రమేష్ గారు మాట ఇవ్వడం జరిగింది.” అంటూ డిప్యూటీ స్పీకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read : మావోల సంచలన ప్రకటన.. అతనికి స్ట్రాంగ్ వార్నింగ్..!

ఇదే విషయంపై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. “నేను చేసిన పనులు హైజాక్ చేయాలని చూస్తే.. ఏ విధంగా ఎక్కడ సమాధానం చెప్పాలో నాకు తెలుసు. సహకరించండి.. అందరం కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యం కాదు. నా పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు శాసనసభ్యుల సహకారం తీసుకుంటున్నాను. నేను కూడా వారికి సహకరిస్తున్నా.. పార్టీలు వేరైనా సోదర భావంతో పని చేస్తున్నా. సంబంధం లేకుండా, బాధ్యత లేకుండా, తగుదునమ్మా నేనున్నా అని వచ్చి.. నన్ను కెలకడానికి ఎవరైనా ప్రయత్నిస్తే… గతంలో చెప్పాను.. నాలో అపరిచితుడు ఉన్నాడు.. బయటకు వస్తాడు. సామాన్యుడైన శ్రీనివాసవర్మ.. ఏవిధంగా రాజకీయం చేయగలడో ఆ విధంగా చేసే పార్లమెంట్ టికెట్ తెచ్చుకున్నా.. నరసాపురం పార్లమెంట్ చరిత్రలోనే 2 లక్షల 80 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గా.. కేంద్ర మంత్రిని అయ్యా. కాబట్టి కొన్ని విషయాలు అందరికీ తెలియాలని చెబుతున్నా. బైపాస్ నా బ్రాండ్, 165 హైవే నా బ్రాండ్, వందేభారత్ నా బ్రాండ్, ఫ్లై ఓవర్, ఆర్వోబీలు నా బ్రాండ్.. చెప్పుకోవటానికి నేనేం సిగ్గుపడను. వెనకాడను. నా ప్రయత్నం, నా కృషి కారణం. ఎవరో చేసిన అభివృద్ధిని నేను చేశానని చెప్పుకునే స్థాయికి శ్రీనివాసవర్మ దిగజారలేదు. నేను చేసిన అభివృద్ధిని నేను మాత్రమే చేశానని చెప్పుకోవడానికి శ్రీనివాసవర్మ వెనుకాడడు.” అంటూ కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. మీరు చేయనివి కూడా మీ ఖాతాలో వాడేస్తున్నారట.. అంటూ రఘురామను ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి ఇద్దరు నేతలు కేంద్రంలో పలుకుబడి ఉన్నవాళ్లే. రఘురామ ఐదేళ్లు ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర పెద్దలతో సన్నిహితంగా మెలిగారు. అయితే అనూహ్యంగా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. కానీ డిప్యూటీ స్పీకర్‌తో సరిపెట్టారు చంద్రబాబు. కానీ రఘురామకు మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా అవకాశం వస్తుందనే మాట బాగా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఇలా నడవని రైలు కోసం ఇద్దరు ముఖ్య నేతలు పరోక్షంగా ఆరోపణలు చేసుకోవడం.. పొలిటికల్ దుమారం రేపుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్