Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

స్డేడియం పేరు మార్పు గోల.. నిజమేనా..!

ఏపీలో ఇప్పుడు పేరు మార్పుపైనే వైసీపీ గోల గోల చేస్తోంది. మంత్రివర్గ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిల్లో ఒకటి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తాడిగడప మునిసిపాలిటీకి వైఎస్ఆర్ పేరు తొలగించడంతో పాటు వైఎస్ఆర్ జిల్లాను మునుపటి మాదిరిగానే వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు మార్చింది. వాస్తవానికి ఈ రెండు మార్పులు తప్ప.. మరోటి చేయలేదు. అయితే ఈ రెండు విషయాలు కూడా వైసీపీ గట్టిగా పోరాటం చేయలేని పరిస్థితి. ఎందుకంటే.. కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చేశారు. అయితే ప్రాంతం పేరు కూడా ఉంటే బాగుంటుందని వచ్చిన డిమాండ్లు, విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం… వైఎస్ఆర్ పేరు అలాగే ఉంచేసి.. చివర్లో కడప అని చేర్చింది. ఇక తాడిగడప మునిసిపాలిటికి వైఎస్ఆర్ అనే పేరు పూర్తిగా తొలగించి మళ్లీ తాడిగడప అనే పేరు పెట్టింది. ఇందుకు కూడా కారణమేమిటంటే.. అసలు కృష్ణా జిల్లాతో వైఎస్ఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆయన కడప జిల్లాకు చెందిన వ్యక్తి. తాడిగడప మునిసిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేకంగా వైఎస్ఆర్ చేసింది కూడా ఏం లేదు. దీంతో అక్కడ తాడిగడప పేరును మళ్లీ పెట్టాలనే డిమాండ్‌ మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read : ఢిల్లీలో చంద్రబాబు, పవన్ రాజకీయం..!

ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు మరో విషయంపై వైసీపీ నేతలు తెగ గోల చేస్తున్నారు. అదే విశాఖ స్టేడియం పేరు మార్పు. విశాఖలో ఉన్న క్రికెట్ స్టేడియం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు… బీసీసీఐ పరిధిలో ఉంది. దాని నిర్మాణం, నిర్వహణ పూర్తి బాధ్యత బీసీసీఐ చూస్తుంది. ఈ స్టేడియంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అప్పట్లో ఇక్కడ స్టేడియం నిర్మాణానికి స్థలం మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఆ స్టేడియం నిర్మాణ బీసీసీఐ చేస్తే.. నిర్వహణ మాత్రం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చూస్తోంది. అందుకే స్టేడియం పేరు కూడా ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అని పెట్టారు. అయితే వైఎస్ఆర్ మరణానంతరం దీనికి వైఎస్ఆర్ పేరు కూడా తగిలించారు.

Also Read : పిచ్చి పది రకాలు.. అందులో ఇది కూడా ఒకటి..!

తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విశాఖ స్టేడియంను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు దత్తత తీసుకుంది. దానికి అనుగుణంగా స్డేడియంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు నిర్వాహకులు. స్టేడియం పేరులో ఎలాంటి మార్పు చేయనప్పటికీ వైఎస్ఆర్ పేరు తొలగించారంటూ వైసీపీ నేతలు తెగ గోల చేస్తున్నారు. దీనిపై ఏసీఏ పెద్దలు క్లారిటీ ఇచ్చారు. అసలు వైఎస్ఆర్ పేరు తొలగించినట్లు ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. స్టేడియంలో ఇప్పటికీ వైఎస్ఆర్ బొమ్మ ఉందని.. పేరు కూడా మార్చలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదే అంశంపై వైసీపీ నేతలపై విశాఖ వాసులు, క్రికెట్ లవర్స్ సెటైర్లు వేస్తున్నారు. అసలు క్రికెట్‌కు వైఎస్ఆర్‌కు సంబంధం ఏమిటంటున్నారు. స్టేడియం స్థలం ఆయన కాదు కేటాయించింది. కనీసం క్రికెట్‌లో ఎక్స్ ట్రా ప్లేయర్ కూడా కాదు. అలాంటప్పుడు పేరు ఎందుకు ఉంటే ఏమిటీ పోతే ఏమిటి అంటూ సెటైర్లు వేస్తున్నారు. అసలు విశాఖ క్రికెట్ స్టేడియంకు అల్లూరి సీతారామరాజు పేరు పెడితే ఎలాంటి ఇబ్బందులు రావంటున్నారు విశాఖ వాసులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్