Saturday, September 13, 2025 03:22 AM
Saturday, September 13, 2025 03:22 AM
roots

కోహ్లీ సంచలన నిర్ణయం.. వద్దంటున్న బోర్డ్

టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నాడా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. కోహ్లీ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. తాను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటాను అనే విషయాన్ని కోహ్లీ.. బోర్డు పెద్దలకు చెప్పగా.. పునరాలోచించుకోవాలని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్ళుగా కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో ప్రభావం చూపించలేక ఇబ్బంది పడుతున్నాడు.

Also Read : యుద్ధం సమాప్తం.. రెండు దేశాల కీలక ప్రకటన

స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన సీరీస్ వైట్ వాష్, ఆస్ట్రేలియా పర్యటనలో విఫలం కావడం వంటివి కోహ్లీపై ఒత్తిడి పెంచుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ మెరుగ్గా రాణించినా.. ఇంగ్లాండ్ పర్యటనలో ఎంత వరకు రాణిస్తాడు అనేది చెప్పలేని పరిస్థితి. ఈ తరుణంలో జట్టులో జరుగుతున్న కొన్ని వ్యవహారాలు కూడా కోహ్లీని ఇబ్బంది పెట్టే సూచనలు కనపడుతున్నాయి. రోహిత్ శర్మ తప్పుకోవడంతో టెస్ట్ క్రికెట్ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : వారం రోజుల్లో ఐపిఎల్ రీస్టార్ట్..?

యువ ఆటగాళ్లకు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే కోహ్లీ మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాడు అని సమాచారం. బూమ్రా లేదా రాహుల్ కు లేదంటే పంత్ కు సారధ్య బాధ్యతలు ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. గిల్ కు బాధ్యతలను అప్పగించడాన్ని కోహ్లీ ఇష్టపడటం లేదని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంగ్లాండ్‌లో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ పర్యటనకు భారత జట్టులో కోహ్లీకి చోటు ఖాయమే. ఇంగ్లాండ్ పరిస్థితులు కోహ్లీకి అనుభవం ఉంది కాబట్టి కోహ్లీ అక్కడ కీలక ఆటగాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్