Friday, September 12, 2025 05:21 PM
Friday, September 12, 2025 05:21 PM
roots

జగన్ కోసం విజయసాయి కొత్త స్ట్రాటజీ..?

వైసీపీ నుంచి రాజకీయాల నుంచి తప్పుకున్న మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పుడు వైయస్ జగన్ కు తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వైసిపి వర్గాల్లో కొన్నాళ్ళ నుంచి వ్యక్తం అవుతుంది. రాజకీయంగా, వ్యక్తిగతంగా జగన్ జీవితం పై విజయ సాయి రెడ్డి ప్రభావం చాలా ఎక్కువ. దీనితో విజయసాయిరెడ్డి విషయంలో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలు కావడం సహజమే. పార్టీ కోసం పెట్టుబడి పెట్టిన నేతలు, పార్టీని నమ్ముకున్న కొంతమంది నాయకులు ఇప్పుడు విజయ సాయి రెడ్డి విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : అమరావతి పనుల్లో కీలక పరిణామం

ఇక వైసీపీ అధిష్టానంలో కూడా విజయసాయిరెడ్డి విషయంలో కాస్త భయాలే ఉన్నాయి అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న కొన్ని మాటలు.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో.. పలు చర్చలకు దారి తీస్తున్నాయి. జగన్ 2019లో అధికారంలోకి రావడానికి విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక మరోసారి 2029లో జగన్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు విజయ సాయి రెడ్డి అదే స్థాయిలో కష్టపడుతున్నారు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.

Also Read : వంశీని వైసీపీ వదిలేసినట్లేనా..?

అందుకే జగన్ పై పాజిటివ్ కార్నర్ క్రియేట్ చేసేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం కోటరీ మాత్రమే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విజయసాయి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ తప్పేమీ లేదని.. పక్కనున్న కోటరీనే తప్పంతా చేసింది అనే విషయాన్ని విజయసాయిరెడ్డి ప్రాజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. దీని ద్వారా మరోరకంగా జగన్ పై సానుభూతి పెంచాలనే విజయసాయి ప్రయత్నిస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read : దొంగల్లా వస్తున్నారు.. వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలనం

ఇక ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ దూరం పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో విజయ్ సాయి రెడ్డి రంగంలోకి దిగి జగన్ పై పాజిటివ్ అభిప్రాయాన్ని, సానుభూతిని ప్రజల్లో పెంచేందుకు ఆయనను పక్కనున్న వ్యక్తులే నాశనం చేశారు అనే అభిప్రాయాన్ని ప్రజల్లో బలపరిచేందుకు తనవంతు ప్రయత్నాలు తాను చేస్తున్నట్టు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్