వైసీపీ నేతలకు ఒక్కొక్కరికి నిదానంగా ఉచ్చు బిగుస్తోంది. ప్రజా సంపదను దోచుకున్న వారి భరతం పట్టడానికి కూటమి సర్కార్ సీరియస్ గా ఫోకస్ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారం చూసి రెచ్చిపోయిన వారిని పోలీసులు అలాగే రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వెంటాడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ పోర్ట్ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేసింది. కాకినాడ పోర్ట్ లో అక్రమ రేషన్ బియ్యం దందా జరుగుతోందని ముందు నుంచి టీడీపీ, జనసేన ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : హీరోలకు ఇది కరెక్టా.. ఆ ప్రాణానికి బాధ్యత ఎవరిది..?
ఇప్పుడు చెప్పినట్టుగానే కాకినాడ పోర్ట్ అక్రమాలపై సర్కార్ ఫోకస్ చేసింది. కాకినాడ పోర్ట్ నిర్వహణ బాధ్యతలను అక్రమంగా లాక్కున్న అరబిందో సంస్థకు చుక్కలు చూపించడానికి రెడీ అయింది. కాకినాడ పోర్ట్ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ… విజయ్ సాయి రెడ్డి పై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసిన సిఐడి అధికారులు కీలక అడుగులు వేయడానికి సిద్దమయ్యారు. విజయసాయి రెడ్డి తో పాటు వైవి విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి ల పై కూడా లుక్ అవుట్ సర్క్యులర్లు జారీ చేసారు.
Also Read : కార్యకర్తలు.. అభిమానులు ఒక్కటే అని ప్రూవ్ చేసిన పుష్ప 2
కాకినాడ పోర్ట్ వాటాలను బలవంతంగా బదిలీ చేయించుకున్నారని విజయ్ సాయి రెడ్డి, విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి లపై కేసు నమోదు చేసిన సిఐడి… వారిని విచారించడానికి సిద్దమైంది. కేసు నమోదు నేపథ్యంలో నిందితులు విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ సర్క్యులర్లు జారీ చేసింది సిఐడి. సోషల్ మీడియాలో రేచ్చిపోతూ… తాను ఏ పాపాలు చేయలేదు అని చెప్పుకునే విజయసాయికి ఉచ్చు బిగిసినట్టే కనపడుతోంది.