రాజకీయాలు వద్దు.. వ్యవసాయమే ముద్దు అంటూ.. వైసీపీకి, పాలిటిక్స్‌కు దూరంగా వెళ్లిపోయిన విజయసాయిరెడ్డి ఇప్పుడు తన మాజీ బాస్ జగన్‌కు గట్టి షాకిచ్చారు. విలువలు, విశ్వసనీయత, క్రెడిబులిటీ, క్యారెక్టర్ అంటూ పెద్ద పెద్ద పదాలతో మాట్లాడిన జగన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అవన్నీ ఉన్న వాడిని కాబట్టే ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదంటూ విజయసాయి చేసిన ట్వీట్ ఇప్పుడు వైసీపీలో కాక రేపుతోంది. రేపో మాపో మరికొంతమంది ఎంపీలు బయటకు వస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో మరింత గుబులు రేపాయి. క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత ఉంటేనే అటువంటి లీడర్‌ను ప్రజలు నమ్ముతారని, కాలర్ ఎగరేసుకుని అతనే తమ లీడర్ అని చెబుతారని వ్యాఖ్యానించారు.
Also Read: టీడీపీ ఆఫీస్ కు నాగార్జున.. కారణం ఏంటీ..?
ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎవరికైనా ఇదే వర్తిస్తుందని, విలువలు కోల్పోతే రాజకీయాల్లో ఉండటం అనవసరమన్న జగన్… విజయసాయిరెడ్డి అయినా ఇప్పటి వరకు వెళ్లిపోయిన ముగ్గురు ఎంపీలు అయినా లేదా భవిష్యత్‌లో వెళ్లబోయే ఒకరిద్దరు ఎంపీలకైనా ఇదే వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ప్రధానంగా చేసినవే.. పైగా ఆయన పేరు కూడా చెప్పడంతో జగన్ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ఎక్స్‌లో స్పందించారు. జగన్ పేరు డైరెక్ట్‌గా చెప్పకుండా ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. జగన్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చినట్లుగా ఈ ట్వీట్ చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది.
Also Read: షర్మిలను దెబ్బ కొట్టడమే లక్ష్యమా…?
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికీ, ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదంటూ ట్వీట్ చేశారు. భయం అనేది తనలో ఏ అణువులో లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులను మరి రాజకీయాలనే వదులుకున్నానని విజయసాయి స్పష్టం చేశారు. సహజంగా జగన్‌కు ఎదురు చెప్పే ధైర్యం విజయసాయిరెడ్డికి లేదనేది అందరి మాట. రాజకీయాలను వదిలి వేస్తున్నానని ప్రకటించిన రోజు కూడా 2029లో జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ.. తనకు ఇప్పటి వరకు అవకాశం ఇచ్చిన జగన్ దంపతులకు కృతజ్ఞతలు కూడా విజయసాయి తెలిపారు. పైగా తాను రాజీనామా చేసే ముందు జగన్‌తో మాట్లాడానని, ఆయన ఒకసారి ఆలోచించుకోమని చెప్పడమే కాకుండా, వదలి వెళ్లడం మంచిది కాదని చెప్పారని కూడా విజయసాయి అప్పట్లో క్లారిటీ ఇచ్చారు.
Also Read: చీరాలలో గ్రూపు రాజకీయాలకు తెరతీసిన మాజీ ఎమ్మెల్యే..!
జగన్ పట్ల తన విధేయతను ప్రకటించిన విజయసాయి.. ఇప్పుడు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. విజయసాయిరెడ్డి ట్వీట్‌పై రియాక్ట్ అవ్వాలా లేదా అనే అంశంపై తాడేపల్లి ప్యాలెస్‌లో చర్చలు జరిగాయి. జగన్ పేరు గానీ, వైసీపీ ప్రస్తావన కానీ లేకపోవడంతో… విజయసాయి ఎక్స్‌లో చేసిన కామెంట్ పై పెద్దగా స్పందించడం మంచిది కాదని వైసీపీ నేతలు కొంతమంది భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. వైసీపీ షోషల్ మీడియా మాత్రం ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇస్తోంది. పార్టీ ఆదేశాలతోనే ఇలా కౌంటర్ ఇస్తున్నారనేది బహిరంగ రహస్యం.