Wednesday, February 4, 2026 08:11 AM
Wednesday, February 4, 2026 08:11 AM

సాయిరెడ్డి రాజకీయ ప్రయాణం అటేనా..?

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ ప్రయాణం ఎటువైపు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న ప్రశ్న. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణకు హాజరైన సాయిరెడ్డి తన రాజకీయ పునరాగమనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఏడాది క్రితం వైసీపీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. అదే సమయంలో రాజ్యసభ సభ్యత్వానికి కూడా సాయిరెడ్డి రాజీనామా చేసేశారు. ఆ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరేది లేదని.. ఇకపై వ్యవసాయానికే తాను పరిమితం అని వ్యాఖ్యానించారు.

Also Read : చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తున్నారా..?

వైసీపీలో ఒక దశలో నెంబర్ టూ స్థానంలో నిలిచిన వ్యక్తి విజయసాయిరెడ్డి. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఢిల్లీలో వైసీపీ తరఫున చక్రం తిప్పారు కూడా. సాయిరెడ్డి ఢిల్లీ పెద్దల దగ్గర చాలా మంచి పలుకుబడి ఉంది. ఒకరోజు పార్లమెంట్ లాబీల్లో సాయిరెడ్డిని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యేకంగా “సాయిరెడ్డి గారు ఎలా ఉన్నారు.. బాగున్నారా..” అని పేరు పెట్టి పిలిచి తెలుగులో పలకరించారు. ఆ వీడియో అప్పట్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లోనే సాయిరెడ్డి పలుకుబడి గురించి, లాబీయింగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడిచింది కూడా.

విజయసాయిరెడ్డికి దాదాపు అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, బీఎస్పీ, ఎస్పీ, బీఆర్ఎస్ నేతలతో చాలా దగ్గర సంబంధాలున్నాయి. అందుకే జగన్ అధికారంలోకి రావటం వెనుక సాయిరెడ్డి చాలా కీలక పాత్ర పోషించారనేది బహిరంగ రహస్యం. జగన్ అక్రమాస్తుల కేసులో సాయిరెడ్డి ఏ2గా కూడా ఉన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చుట్టూ కోటరీ చేరిందని.. వాళ్లే తనను జగన్‌కు దూరం చేశారనేది సాయిరెడ్డి మాట. జగన్‌కు తెలిసి లిక్కర్ స్కామ్ జరగలేదని.. అలా తెలిస్తే జగన్ ఒప్పుకునే వాడు కాదని ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు సాయిరెడ్డి.

Also Read : తెలంగాణలో ఫిబ్రవరి నుంచే ఎన్డీయే వార్ షురూ..?

ఈడీ విచారణ అనంతరం సాయిరెడ్డి చేసిన పొలిటికల్ రీ ఎంట్రీ కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తాను రాజకీయ రిటైర్‌మెంట్ ప్రకటన చేసి ఏడాది అయ్యిందని.. భవిష్యత్ ప్రణాళిక త్వరలో ప్రకటిస్తా అన్నారు. తిరిగి రాజకీయాల్లోకి వస్తా అన్నారు కూడా. దీంతో సాయిరెడ్డి ఏ పార్టీలో చేరతారనే ప్రశ్న ఇప్పుడు బాగా వినిపిస్తోంది. సాయిరెడ్డికి తెలుగుదేశం, జనసేన పార్టీల గేట్లు తెరుచుకునే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలాంటి ప్రయోజనం ఉండదని సాయిరెడ్డికి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి ఎదురుగా ఉన్నవి రెండే మార్గాలు. ఒకటి వైసీపీ, మరోటి బీజేపీ. నిన్నటి వరకు జగన్ చుట్టూ ఉన్న కోటరీ అంటూ విమర్శలు చేసిన సాయిరెడ్డి వైసీపీలో చేరే పరిస్థితి లేదు. దీంతో సాయిరెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలా చేరటం వల్ల అటు సాయిరెడ్డికి, ఇటు జగన్‌కు కూడా పరోక్షంగా ప్రయోజనం ఉంటుందనేది వాస్తవం. మరి సాయిరెడ్డి ప్రయాణం ఎటూ అనేది తేలాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్