Friday, September 12, 2025 11:02 PM
Friday, September 12, 2025 11:02 PM
roots

రాజకీయాలకు గుడ్‌ బై.. ఇక వ్యవసాయమే..!

రాజకీయాలకు గుడ్‌ బై.. ఇక వ్యవసాయమే..!

వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎంపీలు విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే రాజకీయాలకు కూడా గుడ్ బై చెబుతున్నట్లు ఇద్దరు ఎంపీలు ప్రకటించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి అత్యంత ఆప్తులు. ఆడిటర్‌గా జీవితం ప్రారంభించిన విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్‌ టూ స్థానం వరకు చేరుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి ఏ2గా ఉన్నారు. వైసీపీ ప్రారంభించిన నాటి నుంచి జగన్‌తోనే ఉన్నాడు. రెండుసార్లు ఎంపీగా విజయసాయిరెడ్డికి జగన్ అవకాశం కూడా ఇచ్చాడు. అయితే చంద్రబాబు కుటుంబంపైన పదేపదే వ్యక్తిగత విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి… అనూహ్యంగా రాజకీయ సన్యాసం ప్రకటం చేశారు.

Also Read : టీటీడీ సంచలన నిర్ణయం..? వారికి గుడ్ బై..?

రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ నెల 25న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరడం లేదన్నారు. అలాగే వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదంటూ ట్వీట్‌ చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత అని… ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. ఎవరూ ప్రభావితం చేయలేదని కూడా విజయసాయిరెడ్డి ప్రకటించారు. నాలుగు దశాబ్దాలుగా, 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటా అంటూ వ్యాఖ్యలు చేశారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్‌కు, తనను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన వైఎస్ భారతికి కూడా కృతజ్ఞుడిని అంటూ పోస్ట్‌ చేశారు.

Also Read : ఆ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు..!

టీడీపీతో రాజకీయంగా విబేధించా… చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విబేధాలు లేవు.. పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందన్నారు. భవిష్యత్తు వ్యవసాయం అంటూ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ తరఫున ఢిల్లీలో విజయసాయిరెడ్డి పెద్ద లాబీయిస్ట్‌గా పేరు. అలాగే వైసీపీలో ట్రబుల్‌ షూటర్‌గా విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డికి పేరు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు పార్టీకి, పదవులకు రాజీనామా చేయడంతో వైసీపీ భవిష్యత్‌ ఏమిటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. జగన్‌తో కలిసి విజయసాయిరెడ్డి కూడా జైలు జీవితం గడిపారు. అలాంటి ఏ2 ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించడంతో జగన్‌ దాదాపు ఒంటరి అయినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్