Tuesday, October 28, 2025 02:26 AM
Tuesday, October 28, 2025 02:26 AM
roots

ఇదేందయ్యా… వదిన అలా.. మరిది ఇలా..!

ఏపీలో రాజకీయాలు చాలా హాట్‌హాట్‌గా మారుతున్నాయి. ఏ చిన్న విషయమైనా సరే… అది రాష్ట్ర స్థాయిలో దుమారం రేపుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు దావూస్ పర్యటన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అదే విడదల రజని మరిది విడదల రాము చంద్రబాబుతో ఉన్న ఫోటో. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ముఖ్యనేతల్లో విడదల రజిని ఒకరు. 2017లో విజయవాడలో జరిగిన మహానాడుతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. వేదికపైన మాట్లాడే అవకాశం ఇచ్చిన చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. సైబరాబాద్‌లో నాటిన మొక్కను నేను అంటూ రజిని చెప్పిన డైలాగ్‌ యూ ట్యూబ్‌లో ఇప్పటికీ మారుమోగుతుంది. చిలకలూరిపేట టికెట్ ఆశించిన రజినీకి చంద్రబాబు మొండి చెయ్యి చూపించారు. ప్రత్తిపాటి పుల్లారావును కాదని టికెట్ ఇచ్చే అవకాశం లేదని తేల్చేశారు. దీంతో 2018లో వైసీపీలో చేరారు రజిని. ఏడాది పాటు బలంగానే రాజకీయాలు చేయడంతో… సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌ను కాదని రజినీ వైపే మొగ్గు చూపారు జగన్. దీంతో 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన విడదల రజినీ… రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావుపై విజయం సాధించారు.

Also Read : గద్దర్ కు పద్మ అవార్డా..? బాంబు పేల్చిన బండి

అయితే తొలిసారి గెలిచిన రజినీకి లక్ మామూలుగా లేదు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో రజినీని కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు జగన్. అయితే నియోజకవర్గంలో రజినీ అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయని సొంత పార్టీ నేతలే పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. చివరికి రజినీ మరిది చేసిన పెత్తనం భరించలేక నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీ కూడా మారారు. అయితే ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం టార్గెట్ వైసీపీ నేతలన్నట్లుగా వ్యవహరిస్తోంది. గతంలో ఎవరైతే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారో వారిని టార్గెట్ చేస్తోంది కూటమి సర్కార్. అందులో భాగంగానే విడదల రజినీ అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది కూటమి సర్కార్. ఈ నేపథ్యంలో సొంత నియోజకవర్గం చిలకలూరిపేటకు ప్రస్తుతం విడదల రజినీ దూరంగా ఉంటున్నారు.

Also Read : ఏపీలో నామినేటెడ్ సందడి.. వాళ్ళకే పదవులు…!

అయితే చంద్రబాబు దావూస్ పర్యటనలో విడదల రజినీ మరిది విడదల రాము పాల్గొన్నట్లున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఇది పొలిటికల్ సర్కిల్‌లో పెద్ద దుమారం రేపుతోంది. వదిన విడదల రజిని చంద్రబాబును విమర్శిస్తుంటే… మరిది విడదల రాము మాత్రం అదే చంద్రబాబుతో ఫోటో కోసం ఎగబడుతున్నారంటూ కామెంట్ చేశారు. వాస్తవానికి దావోస్ పర్యటన అనేది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలు పారిశ్రామిక సంస్థల దిగ్గజాలతో చర్చించేందుకు చంద్రబాబు దావూస్ వెళ్లి వచ్చారు. అక్కడ బిల్‌గేట్స్ వంటి బిజినెస్‌మెన్‌తో పాటు ఎన్‌ఆర్‌ఐలతో కూడా ముచ్చటించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఇలాంటి సమయంలోనే విడదల రాము కూడా చంద్రబాబుతో కలవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. పల్నాడు జిల్లాలో అయితే గత వైసీపీ ప్రభుత్వ పాలనలో టీడీపీ నేతల పేరు కనిపిస్తే చాలు… శిలాఫలాకలు, ఆర్చ్‌లను కూల్చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య నువ్వా -నేనా అన్నట్లుగా పరిస్థితి మారింది. అయితే ఎన్నికల ముందు చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి విడదల రజినీని మార్చారు జగన్. దీంతో ఒకదశలో విడదల రజినీ జనసేనలో చేరతారనే పుకార్లు కూడా షికారు చేశాయి. ఓడిపోతానని తెలిసినప్పటికీ అయిష్టంగానే రజినీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఎన్నికల తర్వాత కూడా రజినీ పార్టీ మారుతారని అంతా భావించారు. బాలినేని, ఉదయభాను, రోశయ్య, మోపిదేవి వంటి నేతలతో పాటు రజినీ కూడా పార్టీ మారుతారనే పుకార్లు బలంగా వినిపించాయి. కానీ అలా జరగలేదు. అయితే దావూస్ పర్యటనలో విడదల రాము చంద్రబాబుతో ఉన్న ఫోటో వైరల్‌గా మారడంతో… రజినీ కూడా సైకిలెక్కుతున్నారా అనే అనుమానం వస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్