Friday, September 12, 2025 10:39 PM
Friday, September 12, 2025 10:39 PM
roots

టాలీవుడ్ కి పాకిన స్పెషల్ సాంగ్ ట్రెండ్.. ప్రభాస్ సినిమాలో సీనియర్ హీరోయిన్

ఒకప్పుడు సినిమాలో ఐటెం సాంగ్స్ ఒక ఊపు ఊపేవి. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ హవా నడుస్తోంది. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ లో స్కిన్ షో తో దుమ్ము రేపే వారు హీరోయిన్లు. ఇప్పుడు మాత్రం సీనియర్ హీరోయిన్ల హవా ఎక్కువైంది. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో మనసిలాయో అనే సాంగ్ కు చాలా మంచి స్పందన వచ్చింది. మలయాళం సీనియర్ హీరోయిన్ మంజు వారియర్ ఆ సాంగ్ లో ఆడి పాడారు. ఆ సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

Also Read : ఏపీ ముఖచిత్రం మార్చేసిన 2024…!

45 ఏళ్ల వయసులో ఆమె గ్రేస్ చూసి మాస్ క్లాస్ ఆడియన్స్ ఫీదా అయిపోయారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ మన తెలుగులో కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ కనబడుతోంది. ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ పక్కన ఓ స్టార్ హీరోయిన్ స్టెప్పులు వేసే ఛాన్స్ కనబడుతోంది. బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటించిన త్రిష ది రాజాసాబ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ సాంగ్ కోసం దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు ఆమె డిమాండ్ చేసినట్టు టాక్.

Also Read : ఫస్ట్ డే పుష్ప 2 రికార్డుల జాతర

ఇక మరో సీనియర్ హీరోయిన్ నయనతార పేరు కూడా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం పరిశీలించినట్లుగా టాక్. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ హవా టాలీవుడ్ ను ఊపేస్తోంది. తమిళంలో ఈ ట్రెండ్ సూపర్ సక్సెస్ కావడంతో ఇక మిగిలిన భాషల్లో స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా షూటింగ్ దాదాపుగా ఫినిష్ చేసారు. మరో 20 రోజుల పాటు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ సినిమాపై హైప్ పెంచేసింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్