వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె రెండవ వివాహం గురించి అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు చేసారు ప్రసన్న కుమార్ రెడ్డి. దీనితో వేమిరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసారు. ఈ దాడి విషయంలో తమకు ఏ సంబంధం లేదని, గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేతిలో చాలా మంది ఇబ్బంది పడ్డారని, వారు దాడి చేసి ఉంటారని వ్యాఖ్యానించారు.
Also Read :ప్రజల ముందుకు ఎయిర్ ఇండియా విమాన ప్రమాద కారణాలు..!
ప్రసన్న కుమార్ రెడ్డిపై ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసారు. ప్రసన్న కుమార్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. మరోసారి ఎవరూ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. దీనిపై స్పందించిన ప్రసన్న కుమార్ రెడ్డి.. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. వైసీపీ బుద్ధి ఇదే అన్నారు ప్రశాంతి రెడ్డి. ఈ విషయంలో తనను అరెస్ట్ చేసినా సరే జైలుకు వెళ్తా అంటూ స్పష్టం చేసారు.
Also Read :విశాఖలో మరో భారీ పెట్టుబడి.. నారా లోకేష్ కీలక ఒప్పందం
ఇదిలా ఉంచితే.. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఈలలు వేయడం, చప్పట్లు కొట్టడం వంటివి ఆశ్చర్యపరిచాయి. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నా సరే అక్కడ ఉన్న వైసీపీ నేతలు కూడా ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇక పదే పదే.. ప్రసన్న కుమార్ రెడ్డి రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం, వాటిని వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేయడం షాక్ కు గురి చేసే అంశం. వరుసగా ప్రశాంతి రెడ్డి.. ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లెలు అవుతారు.
Also Read :తెలుగు వాడి కెరీర్ ప్రమాదంలో పడిందా..?
సోదరి క్యారెక్టర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్.. తన చెల్లెలు షర్మిలపై చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయని మండిపడుతోంది టీడీపీ. మహిళలను అవమానించే విషయంలో ఆ పార్టీ నేతలు ముందు ఉంటారు అనేది టీడీపీ, జనసేన ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఆ ఆరోపణను నిజం చేసింది వైసీపీ అంటున్నారు టీడీపీ కార్యకర్తలు. ఈ వ్యాఖ్యలపై టీడీపీతో పాటుగా జనసేన కూడా ఆగ్రహం వ్యక్తం చేసాయి. సైకో మనస్తత్వాలు అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.




