వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మహిళా కమీషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఇప్పుడు ఏపి రాజకీయాల్లో స్పీడ్ పెంచారు. తెలుగు దేశం పార్టీలోకి వచ్చేందుకు సిద్దమవుతున్న ఆమె జగన్ పై ఇప్పుడు దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయవాడలో ఎంపీ కేశినేని చిన్నిని ఆమె కలిసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేసారు. వైసీపీ అగ్ర నాయకత్వంపై సీరియస్ గా ఉన్న పద్మ… జగన్ ను టార్గెట్ గా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేసారు. అసలు వైసీపీ పగ్గాల నుంచి జగన్ తప్పుకోవాలని సంచలన డిమాండ్ చేసారు.
Also Read: ఇండస్ట్రీ కొంప ముంచిన అల్లు అర్జున్..!
విజయసాయి రెడ్డి… ఉప ముఖ్యమంత్రి పవన్ పై సానుభూతి కురిపించే ప్రయత్నం చేస్తుండటంతో పద్మ రియాక్ట్ అయ్యారు. విజయమ్మకు వైసీపీ పగ్గాలు అప్పగించాలని విజయసాయిరెడ్డి సలహా ఇవ్వాలి అంటూ వాసిరెడ్డి పద్మ సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రిని మార్చాలని సలహా ఇస్తున్న విజయసాయిరెడ్డి ముందు తన పార్టీని చక్కదిద్దుకోవడానికి జగన్ కు సలహా ఇవ్వాలని ఎద్దేవా చేసారు. జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్ లో విజయసాయి చిల్లర రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు విజ్ఞత కలిగిన వారని ఓటమి తరువాత కూడా కూడా వైసీపీ బుద్ధి మారటం లేదని పద్మ ఫైర్ అయ్యారు.
Also Read: వివేకా కేసు తేలేనా… పోలీసులతో ఆడుకుంటున్న అవినాష్ అండ్ గ్యాంగ్
ఇతర పార్టీలకు సలహాలు ఇచ్చేముందు ప్రజా నమ్మకం కోల్పోయిన జగన్ పార్టీ బాధ్యతల నుండి తప్పుకుని విజయమ్మకు పగ్గాలు అప్పగిస్తే పార్టీ బాగుపడుతుంది అన్నారు. ఈ విధంగా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి జగన్ కు సలహా ఇస్తే బాగుంటుందని పద్మ చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకుల పాపాల పుట్టలు బద్దలవటంతో దిక్కుతోచ డైవెర్షన్ కోసం కూటమి ప్రభుత్వంలో చిచ్చుపెట్టాలని విజయసాయి చీప్ ట్రిక్స్ తో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు ఆమె. జగన్ ప్రభుత్వంలో ప్రతి స్కీము వెనుక పెద్ద స్కాం నడిపినట్లు ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై మాట్లాడే శక్తి లేని విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి పదవిని వివాదం చెయ్యడానికి అత్యుత్సాహం చూపుతున్నాడు అంటూ తీవ్ర విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు.




