Wednesday, February 4, 2026 09:25 PM
Wednesday, February 4, 2026 09:25 PM

వరుణ్ తేజ్ కామెంట్స్ వెనుక వ్యూహం అదేనా…?

టాలీవుడ్ లో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీగా వార్ పీక్స్ లో నడుస్తోంది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మెగా ఫ్యామిలీ అంతర్గత పోరు ఇప్పుడు బయటకు వచ్చింది. మట్కా సినిమా ఈవెంట్ లో వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక టెన్షన్ ఉంటుందని… అలా టెన్షన్ పడుతున్నప్పుడు రామ్ చరణ్ అన్నయ్య నుంచి మొన్న మార్నింగ్ ఫోన్ వచ్చిందని చెప్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అన్నయ్య ఎప్పుడు ఒక ఎమోషనల్ సపోర్ట్ గా ఉంటాడ‌ని బాబాయ్, పెదనాన్న ఎప్పుడు గుండెల్లో ఉంటార‌న్నాడు.

Also Read : బాక్సాఫీస్ విధ్వంసమే.. హోంబలే తో ప్రభాస్ బిజీ బిజీ

అందరూ వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడతావని అడుగుతారని…. మా బాబాయ్, మా పెదనాన్న, మా అన్నయ్య చరణ్ గురించి నేను మాట్లాడుతా… అది నా ఇష్టం అంటూ క్లారిటీ ఇస్తూ… లైఫ్‌లో నువ్వు పెద్దోడివి అవ్వొచ్చు అవ్వకపోవచ్చని… కానీ నువ్వు ఎందుకు, ఎక్కడ మొదలుపెట్టావు.. నీ వెనక సపోర్ట్ ఎవరు ఇచ్చారని నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ ఎందుకు పనికిరాదని అల్లు అర్జున్ ను ఉద్దేశించి పరోక్ష కామెంట్స్ చేసాడు.

Also Read :సౌత్ ఇండియా నయా స్టార్ సంజూ.. రికార్డులు బ్రేక్

చిరంజీవి గారు, బాబాయ్ కళ్యాణ్ గారు, నాన్న, అన్నయ్య.. వాళ్ళు నా మసన్సులో ఉంటారన్నాడు. వాళ్ళు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని చెప్పుకొచ్చాడు. అయితే వరుణ్ తేజ్ కామెంట్స్ వెనుక వ్యూహం ఉందంటున్నారు సినిమా జనాలు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో కలవడానికి ట్రై చేస్తున్నాడని కాని అది ఆ కుటుంబంలో ఇష్టం లేదని, అందుకే అన్ స్టాపబుల్ ఈవెంట్ లో బన్నీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడని, కాని గ్యాప్ ఫిల్ చేయడం అసలు మెగా ఫ్యామిలీకి ఇష్టం లేకనే వరుణ్ తేజ్ తో కామెంట్స్ చేయించి ఉండవచ్చు అంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్