Sunday, March 22, 2026 01:36 PM
Sunday, March 22, 2026 01:36 PM

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్ తేజ్ భార్య లావణ్య పండంటి మగబిడ్డను ప్రసవించింది. కొణిదెల కుటుంబంలో మూడోతరంలో మొదటి వారసుడు అంటూ మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ కు ఒక కుమార్తె. పవన్ పిల్లలు ఇంకా చదువుకుంటూనే ఉన్నారు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023, నవంబర్ 1న వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Also Read : కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం..? ఏసీబీ విచారణలో సంచలనాలు

తనకు వారసుడు పుట్టాడంటూ వరుణ్ తేజ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. “Our little man..” అంటూ లావణ్యతో ఉన్న ఫోటోను వరుణ్ తేజ్ పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో లావణ్య తమ మగబిడ్డను మోస్తున్నప్పుడు ఆమె నుదిటిపై వరుణ్ తేజ్ ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉంది. నాగబాబు కుటుంబంలో మొదటి సంతానం.

Also Read : తమిళనాడు పై పవన్ గురి..?

మెగాస్టార్ చిరంజీవి కూడా వారసుడిని చూసి మురిసిపోయారు. “చిన్నా, ఈ లోకానికి స్వాగతం!
కొణిదెల కుటుంబంలో పుట్టిన నవజాత శిశువుకు హృదయపూర్వక స్వాగతం.” అంటూ సోషల్ మీడియాలో బాబును ఎత్తుకున్న ఫోటో పోస్ట్ చేశారు. తల్లిదండ్రులు అయినందుకు వరుణ్, లావణ్య దంపతులకు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి.. తాతయ్య, నానమ్మగా ప్రమోషన్ అయ్యారంటూ నాగబాబు, పద్మజ జోడీకి గ్రీటింగ్స్ చెప్పారు. మొత్తానికి మెగా కుటుంబంలోకి వారసుడి రాకతో ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్