Monday, October 27, 2025 10:44 PM
Monday, October 27, 2025 10:44 PM
roots

వైసీపీలో 14 రోజుల భయం.. వంశీ ఇప్పట్లో కష్టమే..?

ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయి ఇబ్బంది పడుతున్న వైసిపి నేతలకు.. ఇప్పుడు 14 రోజుల రిమాండ్ అనే భయం పట్టుకుంది. ఆ పార్టీ నేతలు రిమాండ్ కు వెళ్లి ఎప్పుడొస్తారో అర్థం కాని పరిస్థితిలో ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. రాజకీయంగా వైసిపి ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో పార్టీ నేతలు ఒక్కొక్కరిని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇటీవల కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్.. మాజీ మంత్రులకు రూట్ మ్యాప్

ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీనితో ఆయన ఎప్పుడు బయటకు వస్తారో అర్థం కాక పార్టీ కార్యకర్తలు కంగారు పడుతున్నారు. వాస్తవానికి 14 రోజుల రిమాండ్ తో జైలుకు వెళ్లిన వాళ్ళు తిరిగి బయటకు రావడం చాలా కష్టమైపోతుంది. బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ అలాగే వైసిపి తరఫున సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే బోరుగడ్డ అనిల్ కుమార్… కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఇలా 14 రోజుల రిమాండ్ తో జైలుకు వెళ్లి ఇంకా తిరిగి రాలేదు. నందిగం సురేష్ ఇటీవల బెయిల్ పై బయటికి వచ్చారు.

Also Read : థమన్ కి ప్రేమతో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా 14 రోజుల రిమాండ్ తో జైలుకు వెళ్లి దాదాపు రెండు నెలల తర్వాత విడుదలయ్యారు. దీనితో పార్టీ అధిష్టానంలో కలవరం మొదలైంది. ఇప్పటివరకు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోని వైయస్ జగన్ ఇక నుంచి పార్టీ తరఫున నేతలకు, కార్యకర్తలకు న్యాయ సహాయాన్ని అందించాలని.. తమ పార్టీ న్యాయవిభాగానికి ఇప్పటికే సూచనలు చేశారు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు 14 రోజుల రిమాండ్ అనే మాట వైసిపి కార్యకర్తలకు, అధిష్టానానికి చుక్కలు చూపిస్తోంది. ఇక వంశీ విషయంలో ఇప్పటికే పలు కేసులను కూడా బయటకు తీసేందుకు కృష్ణాజిల్లా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జిల్లా వ్యాప్తంగా ఆయనపై నమోదైన పలు కేసుల్లో పిటి వారెంట్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్