గతంలో కంటే నేటి రోజుల్లో దైవ భక్తి ఎక్కువైంది అనే మాట వాస్తవం. గతంలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ ఏడాది తిరుమలలో వైకుంఠ ఏకాదశికి భక్తులు ఏ స్థాయిలో తరలి వచ్చారో చూసాం.. ఇక దసరా ఉత్సవాలకు భక్తుల తాకిడి బెజవాడలో ఎలా ఉందో అర్ధమైంది.. అరుణాచలం గిరి ప్రదిక్షణ, కార్తీక మాసోత్సవాలు, సింహాచలం ఆలయానికి భక్త సందోహం.. ఇవన్నీ ఈ మధ్య కాస్త సంచలన విషయాలు. ఈ మధ్య కాలంలో మరో దేవాలయం కూడా బాగా ఫేమస్ అయింది.
Also Read : టీడీపీలో వారికి గ్యారంటీ లేదా..?
ఆ దేవాలయమే వాడపల్లి శ్రీవారి పుణ్యక్షేత్రం. 7 వారాల పాటు ప్రతీ శనివారం పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరతాయి అనే నమ్మకంతో లక్షలాది మంది భక్తులు.. ఈ కోనసీమ తిరుమలకు క్యూ కడుతున్నారు. ఇదే సమయంలో ఆదాయం కూడా ఇక్కడ భారీగానే పెరుగుతోంది. అటు దేవాదాయ శాఖ కూడా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా వాడపల్లి ఆలయానికి వచ్చిన ఆదాయంపై దేవాదాయ శాఖ లెక్కలు విడుదల చేసింది.
Also Read : ఆ ఇద్దరినీ వదలను.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..?
దేవస్థానం అధికారి చక్రధర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. గత 35 రోజులకు గాను స్వామివారికి రూ. 1,87,33,329 ఆదాయం సమకూరింది. ఇదే సమయంలో 47 గ్రాములు బంగారం, ఒక కేజీ 250 గ్రాముల వెండి కూడా ఆదాయంగా చేరింది. అలాగే విదేశీ భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆరు దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు కూడా వచ్చాయి. 25 విదేశీ కరెన్సీ నోట్లు స్వామి వారికి విరాళంగా ఇచ్చారు భక్తులు. అమెరికా, సింగపూర్, కువైట్, ఆస్ట్రేలియా, సౌదీ, యూకే దేశాల కరెన్సీ విరాళంగా ఇచ్చారట.




