Wednesday, February 4, 2026 08:10 PM
Wednesday, February 4, 2026 08:10 PM

మెగా ఫ్యామిలీకి పోటీగా మహేష్ ఫ్యామిలీ

సినీ పరిశ్రమలో వారసులు ఎక్కువయ్యారు. భాష ఏదైనా సరే.. ముందుగా ఒకరు వచ్చి సెటిల్ అయితే చాలు.. ఆ వెంటే చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుూంటారు. ఇందులో ఒరిద్దరు తప్ప.. మిగిలిన వాళ్లు స్టార్ డమ్ సాధించిన దాఖలాలు లేవు. ఇప్పటికే నందమూరి, అక్కినేని కుటుంబాలతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది నటులు సినీ పరిశ్రమలో తమ అదృష్టాన్ని పరిష్కరించుకున్నారు. ఇక కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ హాలీవుడ్ స్టార్‌గా మారిపోయారు. తాజాగా ఘట్టమనేని కుటుంబం నుంచి పెద్ద ఎత్తున నటులు వస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

Also Read : ఎటు పోతోంది ఈ సమాజం.. ఇంత దారుణమా..!

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకేరోజు 3 సినిమాలు విడుదల చేసిన చరిత్ర కృష్ణకు మాత్రమే సొంతం. 300కు పైగా సినిమాల్లో కృష్ణ నటించారు. సినీ పరిశ్రమలో పద్మాలయ స్టూడియో పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేశారు. సోదరులను కూడా సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఇక కృష్ణ నట వారసులుగా రమేశ్ బాబు, మహేష్ బాబు, మంజుల సినిమల్లో నటించారు. మహేష్ ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్‌లో స్టార్‌గా ఎదిగారు. అలాగే కృష్ణ చిన్న అల్లుడు సుధీర్ బాబు కూడా సినిమాల్లోనే కొనసాగుతున్నారు. సహ నటి విజయనిర్మలను రెండో పెళ్ళి చేసుకున్నారు. గిన్నిస్ బుక్ దర్శకురాలిగా విజయనిర్మల రికార్డులకెక్కగా.. ఆమె కుమారుడు నరేష్ కూడా సినీ పరిశ్రమలోనే ఉన్నారు.

Also Read : కన్నీరు పెట్టిస్తున్న రైతన్నల వీడియోలు.. నిండా ముంచిన తుఫాన్

తాజాగా కృష్ణ కుటుంబం నుంచి అరడజను మంది స్టార్లు రానున్నారనే వార్త.. ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతోంది. మంజుల కుమార్తె జాహ్నవి, రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ, రమేశ్ బాబు కుమార్తె భారతీ ఘట్టమనేని, సుధీర్ బాబు ఇద్దరు పిల్లలు చరిత, దర్శన్.. వీరితో పాటు ఇప్పటికే ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్న మహేశ్ బాబు కుమారుడు గౌతమ్.. వీరంతా సిల్వర్ స్క్రీన్ మీద తమ భవిష్యత్తును పరిక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో టాలీవుడ్‌లో మరో మెగా ఫ్యామిలీ అనే మాట బాగా వినిపిస్తోంది. చిరంజీవి తర్వాత ఆయన సోదరులు, వారసులు మొత్తం పది మంది వరకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు. అదే స్థాయిలో కృష్ణ వారసులు కూడా రావడం హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్