రష్యన్ వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ ఆకస్మిక డ్రోన్ దాడి సంచలనంగా మారింది. ఏళ్ళ తరబడి సాగుతున్న ఉక్రెయిన్ – రష్యా యుద్దంలో ఇది ఖచ్చితంగా కీలక ఘట్టంగానే చెప్పుకోవాలి. రష్యా విషయంలో ఉక్రెయిన్ తన వైఖరిని ఈ దాడితో మరోసారి స్పష్టంగా చెప్పింది. ఈ దాడితో ఉక్రెయిన్.. అమెరికాకు కూడా వార్నింగ్ ఇచ్చినట్లు అయింది. ఈ ఏడాది మార్చ్ లో అమెరికాలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడి మధ్య జరిగిన చర్చల తర్వాత ఈ దాడి సంచలనంగానే చెప్పాలి.
Also Read : జగన్ 2.0.. భయపడుతున్న జనం..!
తాము లేకుండా మీరు ఈ యుద్దంలో ముందుకు వెళ్ళలేరు అని, ఎవరూ మీకు సహాయం చేయలేరని ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన రెండు నెలల తర్వాత ఈ దాడికి దిగింది ఉక్రెయిన్. అమెరికా సహాయం లేకుండానే ఈ దాడి చేసింది. అత్యంత లాంగ్ రేంజ్ ఆపరేషన్ గా ఉక్రెయిన్ ఈ దాడిని అభివర్ణించింది. రష్యన్ భూభాగంలోని దూర ప్రాంత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది ఉక్రెయిన్. ఈ దాడితో ఒక్కసారిగా రష్యా కంగుతింది. ఉక్రెయిన్ సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేసిన రష్యాకు ఇది భారీ షాక్ గానే చెప్పాలి.
Also Read : వైసీపీలో మార్పులు జరుగుతాయా..?
ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. తమపై దాడి చేయడానికి సిద్దంగా ఉన్న 41 విమానాలను ఉక్రెయిన్ నాశనం చేసింది. దాడిపై రష్యా స్పందించింది. ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్, ఇవనోవో, రియాజాన్ మరియు అముర్ ప్రాంతాలలోని దాని వైమానిక స్థావరాలను ఫస్ట్-పర్సన్-వ్యూ డ్రోన్‌లను ఉపయోగించి.. తమ లక్ష్యంగా దాడులు చేసినట్టు ప్రకటించింది. 18 నెలల క్రితమే ఈ డ్రోన్ లను రష్యాలోకి పంపింది ఉక్రెయిన్. రహస్యంగా పంపిన ఈ డ్రోన్ లను.. రష్యన్ వైమానిక స్థావరాల దగ్గర ఆపి ఉంచిన ట్రక్కులలో వాటిని దాచిపెట్టారు. దాడి సమయంలో, ఈ ట్రక్కులపై ఉన్న చెక్క క్యాబిన్ల పైకప్పులను రిమోట్ తో ఓపెన్ చేసి.. దాడి చేసారు. తెరుచుకున్నాయి.