Wednesday, February 4, 2026 11:13 AM
Wednesday, February 4, 2026 11:13 AM

మరో ముస్లిం దేశంగా మారుతున్న యూకె..

బ్రిటన్ మరో ముస్లిం రాజ్యంగా మారుతోంది. షరియా చట్టాలు అక్కడ క్రమంగా అమలులోకి వస్తున్నాయనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. బ్రిటన్ షరియా కోర్టులకు “పశ్చిమ రాజధాని”గా మారుతోంది అంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు రాసుకొచ్చింది. ఆ దేశవ్యాప్తంగా 85 ఇస్లామిక్ కౌన్సిల్స్ ఉన్నాయి. యూరప్ లో ఎక్కువగా ముస్లింలకు ఇస్లామిక్ కౌన్సిల్స్ ఉన్న రాజ్యంగా యూకే నిలిచింది. అయితే దీనిపై అక్కడి మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ముస్లింల షరియా చట్టం తమ దేశంలో… దేశ చట్టాలతో సమానంగా వృద్ది చెందుతోందని పేర్కొన్నాయి. మొదటి షరియా కౌన్సిల్ 1982లో యూకేలో ఏర్పాటు చేసారు. ఇస్లామిక్ షరియా కౌన్సిల్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్తర్న్ ఐర్లాండ్, తూర్పు లండన్‌లోని లేటన్‌ లో ఏర్పాటు చేసారు. వివాహ సేవలు, విడాకులు… ఖులా వంటి విడాకుల ప్రక్రియలకు సేవలను అందిస్తోంది. ఇప్పటి వరకు డేటా ప్రకారం, బ్రిటన్‌లో దాదాపు 100,000 ఇస్లామిక్ వివాహాలు జరిగాయి. కాని వీటిని అధికారికంగా నమోదు చేయకపోవడం గమనార్హం.

Also Read : కేటిఆర్ పక్కాగా బుక్ అయ్యాడు.. ఏసీబీ సంచలన అడుగులు

షరియా కోర్టులు ఎక్కువగా పురుషులతోనే నిర్వహిస్తున్నారు. ఇస్లామిక్ పండితుల ప్యానెల్‌ లతో ఈ కోర్టులను నిర్వహిస్తున్నారు. అనధికారిక సంస్థలుగా పని చేస్తున్నాయని, యూకే రాజ్యాంగాన్ని కూడా సవాలు చేసే స్థాయిలో ఈ చట్టాలు మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. విడాకులతో పాటుగా వివాహానికి సంబంధించిన ఇతర విషయాలపై మతపరమైన తీర్పులను ఈ కోర్టులు జారీ చేస్తాయి.

ఇక్కడ మహిళలకు అన్యాయం జరుగుతోందనే వాదన అక్కడి మీడియా లేవనెత్తింది. ముస్లిం మహిళలు మతపరమైన విడాకులు తీసుకోవడానికి షరియా కౌన్సిల్‌లు ఉన్నాయని… పురుషాధిక్యత తమ దేశంలో తప్పుడు సంకేతాలు ఇస్తోందని… పురుషులు విడాకులు తీసుకోవాలంటే ఏకపక్షంగా ఈ షరియా చట్టాలు వ్యవహరిస్తున్నాయనే ఆందోళన వ్యక్తం చేసింది అక్కడి మీడియా. తమ దేశ పౌరులు కూడా వాటిపై ఆసక్తి చూపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది అక్కడి మీడియా.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

పోల్స్