Sunday, October 19, 2025 11:51 PM
Sunday, October 19, 2025 11:51 PM
roots

అన్నాడిఎంకే తోనే టీవీకే.. పొత్తు ఫైనల్..?

గత పది రోజుల నుంచి తమిళనాడులోని కరూర్ ఘటన రాజకీయాలను కుదిపేస్తోంది. దాదాపు 40 మంది ఈ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్, నిర్వహించిన బహిరంగ సభలో చోటు చేసుకున్న ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు చోటు చేసుకుంటున్న తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి, విజయ్ కు ఫోన్ చేసి తన సంతాపం వ్యక్తం చేసారు.

Also Read : మిథున్ రెడ్డి లిక్కర్ కేసు మూలనపడినట్లేనా..?

ఈ విషయాన్ని అన్నాడిఎంకే కీలక నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. ఇదే సమయంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుని ఉండవచ్చని తమిళ మీడియాతో పాటుగా జాతీయ మీడియా కూడా అభిప్రాయపడింది. డిఎంకె ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు గానూ.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అంశానికి సంబంధించి చర్చించినట్టు తెలిపింది. విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే జరిగే నష్టాలను కూడా ఈ సందర్భంగా పళని స్వామి, ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

ఇదే సమయంలో ఓ సంచలనం నమోదు అయింది. అన్నాడీఎంకే ప్రచారంలో నటుడు విజయ్ టీవీకే జెండాలు ప్రదర్శించారు పళని స్వామి. పొత్తుపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన పళనిస్వామి.. కుమారపాలెం నుంచి డీఎంకేపై యుద్ధానికి రెడీ అంటూ ప్రకటించారు. టీవీకే జెండాలను చూపిస్తూ గెలుపు మనదేనని ధీమా వ్యక్తం చేసారు. ఊహించని విధంగా గెలుపు ఉంటుందన్న పళనిస్వామి.. విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు అంటూ ధీమా వ్యక్తం చేసారు. దీనితో రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు.

Also Read : మాస్క్ ఇవ్వలేని వాడు మెడికల్ కాలేజీ కడతాడా..? విశాఖలో షాకింగ్ హోర్డింగ్

2026 పొంగల్ తర్వాత పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని సదరు అన్నాడిఎంకె నేత ప్రకటించారు. ఈ తొక్కిసలాటకు టీవీకే బాధ్యత వహించాలని విమర్శిస్తోన్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. విజయ్‌కి ప్రజాబలం ఉంది, కానీ సంస్థాగత నిర్మాణం లేదని, సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీతో వెళితే, క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలను ఎదుర్కొంటుంది అన్నారు. అన్నాడీఎంకేతో చేతులు కలపడం వల్ల విజయ్ తన పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం దొరుకుతుందని పరిశీలకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్