Saturday, September 13, 2025 04:52 AM
Saturday, September 13, 2025 04:52 AM
roots

టీటీడీ సంచలన నిర్ణయం.. పది రోజులు ఆ దర్శనాలు రద్దు

ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత తిరుమల విషయంలో కీలక అడుగులు పడుతున్నాయి. భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. తిరుమలలో అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక ప్రకటన చేసారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వైకుంఠ ద్వార దర్శనం గూర్చి మాట్లాడుతున్నారని.. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 10 తేదీన ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం అవుతాయన్నారు.

Also Read : సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్..!

వైకుంఠ ఏకాదశి రోజు ఉ 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని.. టికెట్లు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసారు. 10 తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం ఉంటుందని తెలిపారు. అన్ని ప్రత్యేక దర్శనాలను పది రోజులు రద్దు చేశామన్నారు. టికెట్లు లేని భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకూడదని విజ్ఞప్తి చేసారు. సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో దర్శనాలను కల్పించేందుకు సిఫార్సు లేఖల దర్శనం రద్దు చేశామన్నారు.

Also Read : నాడు-నేడు నిజమా ఆబద్దమా..? ఆడిటింగ్ మొదలైంది…!

వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని స్పష్టం చేసారు. సీఎం అదేశాల‌ ప్రకారం సామాన్యభక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసామన్నారు. మైసూరు నుంచి వచ్చిన నిపుణులతో చేసిన పుష్పాలంకరణలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. 3 వేల సిసి కెమరాలతో నిఘా ఏర్పాటు చేసినట్టు వివరించారు. గోవిందమాల‌ భక్తులకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు ఉండదన్నారు. అందరు భక్తులతో కలిసి SSD టోకన్లు తీసుకొని వైకుంఠద్వార దర్శనాలకు రావాలని విజ్ఞప్తి చేసారు. టోకన్లు, టిక్కెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించరని…కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్