తిరుమల.. శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం. ఏడుకొండలు నిత్యం హరి నామ స్మరణతో మారుమోగుతున్న పరమ పుణ్యక్షేత్రం. నిత్యం లక్ష మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ప్రతి రోజు 4 కోట్ల పైగా ఆదాయం. 30 వేల మంది పైగా స్వామి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. వేల మందికి ప్రాణదానం, విద్యాదానం అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంపై నిత్యం ఏదో ఒకవిధంగా నిందలు వేస్తూనే ఉన్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.
Also Read : ప్రజలు మారాలి.. కలెక్టర్లకు చంద్రబాబు డెడ్ లైన్
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం టీటీడీ పాలకమండలి సమావేశమైంది. సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పాలకమండలి ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నెల 23వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
ఈ నెల 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ నెల 25వ తేదీన కొత్తగా నిర్మించిన పీఏసీ 5 భవనాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు.
25వ తేదీన సీఎం పీఏసి – 5 ను ప్రారంభిస్తారు. ఈ నెల 28వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి గరుడ సేవ నిర్వహించాలని నిర్ణయించారు. గరుడ సేవకు 3 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. టీటీడీ చరిత్రలో మొదటి సారి బ్రహ్మోత్సవాలను ఇస్రో పరిశీలించబోతోందని వెల్లడించారు.
Also Read : ఓటీటీ రేట్ లో అఖండ తాండవం.. నెట్ ఫ్లిక్స్ భారీ ధర
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో కీలక నిర్ణయం తీసుకున్నారు. దళితవాడల్లో 1000 ఆలయాలు నిర్మించాలని తీర్మానించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 6 ఆలయాలు దాకా నిర్మిస్తామన్నారు. మత మార్పిడులను అరికట్టేందుకు.. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఏపీ వ్యాప్తంగా ఆలయాలు నిర్మిస్తామన్నారు. ఇక టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని బోర్డు నిర్ణయించింది. తిరుమల పవిత్రత దెబ్బ తీసేలా, టీటీడీ ప్రతిష్ఠ దిగజార్చేలా మాట్లాడితే.. జైలుకు వెళ్లడం ఖాయమన్నారు ఛైర్మన్ బీఆర్ నాయుడు. తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చర్యలు చాలా సీరియస్‌గా ఉంటాయని హెచ్చరించారు.