Monday, October 27, 2025 07:21 PM
Monday, October 27, 2025 07:21 PM
roots

టిడిపిలో నామినేటెడ్ పదవుల కోలాహలం.. లిస్ట్ ఇదే

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకి పెద్ద సవాల్ గా మారింది. పార్టీలో భారీగా ఆశావహులు ఉండటంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ కత్తిమీద సాములా మారింది. మంత్రి పదవులు రాకపోవడంతో నామినేటెడ్ పదవుల కోసం కొందరు సీనియర్ల పట్టు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని కీలక నామినేటెడ్ పోస్ట్ లు కావాలని జనసేన, బిజెపి డిమాండ్ చేస్తున్నాయి. టీటీడీ, ఆర్టీసీ, ఏపీఎండీసీ, ఎస్ఏపీ, పీసీబీ, ఏపీఐఐసి సహా పలు కీలక చైర్మన్ల పదవులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దుర్గగుడి ఛైర్మన్, ఆప్కాబ్, మార్క్ ఫెడ్ పదవుల కోసం పార్టీలో చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నారు. ఏపీఎండీసీ లేక ఏపీఐఐసి చైర్మన్ గా తన సీటుని త్యాగం చేసిన దేవినేని ఉమా కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.

టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని సీనియర్ నేతలు కోరుతున్నట్టు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ గా టీవీ 5 అధినేత బీఆర్ నాయుడు పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. తెలంగాణ నుంచి ఇద్దరు నాయకులుకు టీటీడీ బోర్డు మెంబర్లుగా తీసుకోనున్నారు. కేబినెట్ హోదా ఉన్న పదవులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సామాజిక సమీకరణాలతో నామినేటెడ్ పదవుల కూర్పు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. టిటిడి బోర్డు మెంబర్లుగా దాదాపు 7 గురు ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక అసెంబ్లీలో విప్ గా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఎస్వీబీసీ చైర్మన్ గా తెలంగాణ నుంచి ఓ అధికార ప్రతినిధి కి అవకాశం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సారి నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీ లకు పెద్ద పీట వేయనున్నారు. సీనియారిటీ, పార్టీకి విధేయత, యువతకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. రేపు జరిగే పొలిట్ బ్యూరోలో నామినేటెడ్ పోస్టులపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యే టికెట్ దక్కని ఆశవాహులకు తగిన స్థానం కల్పిస్తా అని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో నామినేటెడ్ పదవులు ఆశించే వారి సంఖ్యా భారీగా ఉండటంతో దీని భర్తీ బాబుకి కత్తిమీద సాములా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్