Friday, September 12, 2025 10:29 PM
Friday, September 12, 2025 10:29 PM
roots

తిరుమల శ్రీవారి భక్తులకు మరో శుభవార్త..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. శ్రీవారిని ప్రతిరోజూ 70 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. నిత్యం కోట్లల్లో ఆదాయం వస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం.. భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు నిరంతరం పని చేస్తోంది. నిత్యాన్నదానం, వసతి, రవాణతో పాటు భక్తుల్లో స్వామి పట్ల భక్తిభావం పెరిగేలా తీవ్రంగా కృషి చేస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా తిరుమల తరహాలో నమూనా ఆలయాలను నిర్మిస్తోంది. అలాగే ఏపీ వ్యాప్తంగా పురాతన ఆలయాల జీర్ణోద్ధారణ కూడా టీటీడీ చేపడుతోంది. తాజాగా మరో కీలక కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది.

Also Read : విశాఖలో మరో భారీ పెట్టుబడి.. నారా లోకేష్ కీలక ఒప్పందం

దేశవ్యాప్తంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చిన్న సైజులో చేతి పుస్తకాల రూపంలో ముద్రించి ప్రజలకు పంపిణీ చేయడం ద్వారా ధార్మిక ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. విపరీతంగా పెరిగిపోతున్న మతమార్పిడులను అరికట్టేందుకు సరికొత్త వ్యూహంతో హిందూ ధర్మ ప్రచారాన్ని సామాన్య ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు సంకల్పించింది. శ్రీ వెంకటేశ్వర వైభవం, విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర సుప్రభాతం, భజగోవిందం, లలితా సహస్రనామం, శివ స్తోత్రం, భగవద్గీత, మహనీయుల చరిత్ర, తదితర హిందూ దేవుళ్లకు సంబంధించిన పురాణాలు తదితర అంశాలతో సంబంధించిన ధార్మిక పుస్తకాలను ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో దళితవాడల్లో ఉచితంగా అందరికీ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు.

Also Read : శంకర్ కు సాధ్యంకాని విజయం శేఖర్ కు ఎలా సాధ్యమైంది?

టీటీడీకి చెందిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగం ద్వారా ఈ ధార్మిక చేతి పుస్తకాలను చిన్న సైజులో భక్తులకు సౌకర్యవంతంగా ముద్రించి దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం కాకుండా తిరుమల, తిరుపతిలో కూడా భక్తులకు శ్రీవారి పుస్తక ప్రసాదంగా అందజేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో శ్రీవారికి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే భక్తులకు ఇలాంటి ధార్మిక చేతి పుస్తకాలను అందజేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని వాటిని పూర్తిగా అధ్యయనం చేసి భక్తుల్లో ఆధ్యాత్మికత పెంచేందుకు దోహదపడుతుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Also Read : బావా, బామ్మర్దులుగా బాలయ్య, వెంకటేష్..!

ఇందుకు టీటీడీ నిధులను ఏమాత్రం వినియోగించటం లేదని కూడా బీఆర్ నాయుడు వెల్లడించారు. పూర్తిగా దాతల సహకారంతోనే ఈ పుస్తకాలను ముద్రిస్తున్నట్లు తెలిపారు. అనేక మంది దాతలు ఇప్పటికే టీటీడీతో సంప్రదింపులు జరిపారని… వారి సహకారంతోనే ఈ చేతి పుస్తకాలను ముద్రించి ధర్మ ప్రచార పరిషత్ ద్వారా అన్ని ప్రాంతాలకు పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే శ్రీవారి గోవింద నామాల పేరుతో పాంప్లెట్లు ముద్రించి.. వాటిని తిరుమలలోని సమాచార కేంద్రాల ద్వారా భక్తులకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇవి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉన్నాయన్నారు. త్వరలోనే చేతి పుస్తకాలు కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్