కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం లక్షలాది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. పండుగ రోజుల్లో, సెలవు రోజుల్లో అయితే రెట్టింపు సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు వస్తారు. ఇటీవల స్వామి వారి సర్వ దర్శనానికి 24 గంటలు సమయం కూడా పడుతోంది. ఇక ముందుగా దర్శనం టికెట్ కొనుగోలు చేసిన భక్తులు కూడా 3 గంటల పాటు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి. దీనికి చెక్ పెట్టేందుకు ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తీవ్రంగా కృషి చేస్తోంది. స్వామి దర్శనం కోసం AI టెక్నాలజీ ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. అందుకే గూగుల్‌తో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమైంది.
Also Read : ఎమ్మెల్సీ దువ్వాడ.. డాక్టరేట్‌లో నిజమెంత?
తిరుమల వచ్చే శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని టీటీడీ బోర్డు సభ్యులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతిసారి ఇదే విషయాన్ని పదే పదే సూచించారు కూడా. దీంతో టీటీడీ బోర్డు పెద్దలు కూడా ఇదే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు మొదలు.. భక్తులకు అందించే అన్ని సౌకర్యాలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూ లైన్‌లో భక్తులకు అన్న ప్రసాదాలు మొదలు.. మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నారు కూడా. దీనిపై ఇప్పటికే భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఆ జెండా మాదే.. వదిలేది లేదు..!
వేసవి రద్దీ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సెలవు రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారి దర్శనానికి తిరుమల చేరుకుంటారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లోనే సుమారు 70 వేల మంది వరకు స్వామి వారిని ప్రతిరోజు దర్శించుకుంటున్నారు. ఇక సెలవు రోజుల్లో అయితే ఈ సంఖ్య లక్ష చేరుతుంది కూడా. ఈ నేపథ్యంలోనే వేసవి రోజుల్లో సిఫార్సు లేఖలపై ఆంక్షలు విధించాలని టీటీడీ బోర్డు భావిస్తోంది. అలాగే ఎన్నో రోజులుగా వినిపిస్తున్న డిమాండ్‌ను కూడా టీటీడీ పరిశీలిస్తోంది. గతంలో దివ్యాంగులు, వయో వృద్ధులకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు నేరుగా దర్శనం అవకాశం కల్పించారు.
Also Read : విచారణకు రాని కాకాని.. పోలీసులు వదిలేస్తారా..?
కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని కూడా పూర్తిగా ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకువచ్చింది. 3 నెలల ముందు ఆన్ లైన్‌లో బుక్ చేసుకున్న వారికే దర్శనానికి అనుమతించే వారు. దీని వల్ల నేరుగా వచ్చిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధానాన్ని మార్చేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. అలాగే ఇప్పటికే తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై వారంలో రెండు రోజుల పాటు దర్శనానికి అవకాశం ఇస్తున్నారు. అలాగే ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై మిగిలిన 3 రోజులు దర్శనం కల్పిస్తున్నారు. వేసవి రద్దీ నేపథ్యంలో వీఐపీ సిఫార్సు లేఖలపై ఆంక్షలు విధించి.. సామాన్య భక్తులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
Malla reddy yallappa