Sunday, March 22, 2026 05:26 PM
Sunday, March 22, 2026 05:26 PM

శివజ్యోతికి టీటీడీ షాక్.. శభాష్ అంటున్న భక్తులు..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. కఠిన చర్యలు తప్పవని తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి రుజువు చేసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా వ్యవహరించిన వాళ్లు ఎవరైనా సరే.. వాళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సిందే అంటున్నారు శ్రీవారి భక్తులు. దేవుని దృష్టిలో అంతా సమానమే అంటున్నారు కూడా. ఏడుకొండల వాడు కోలువైన పవిత్రమైన తిరుమల గిరులపై మద్యపానం, ధూమపానం, మాంసాహార భోజనం, అన్యమత ప్రచారంపై ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో తిరుమల గిరులపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా వీడియోలపై కూడా భక్తి భావన పెంచేలా ఉండాలని టీటీడీ అధికారులు ఇప్పటికే ఆదేశించారు. కానీ కొందరు మాత్రం అత్యుత్సాహంతో సినిమా పాటలకు, పేరడీలు చేస్తూ.. భక్తుల ఆగ్రహానికి గురవుతున్నారు. తర్వాత క్షమాపణలు చెప్పడంతో పాటు.. సోషల్ మీడియాకే దూరమవవుతున్నారు.

Also Read : విభేదాల్లో కూడా సంస్కారమే.. ఓ మెట్టు ఎక్కిన లోకేష్..!

తిరుమల శ్రీవారి సమక్షంలో అందరూ సమానమే. ముఖ్యంగా స్వామి వారి ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. తిరుమల వెళ్లిన వారిని మొదటగా అడిగేది కూడా లడ్డూ ప్రసాదమే. ఇక తిరుమల యాత్రికుల కోసం టీటీడీ అన్న ప్రసాద వితరణ కూడా చేస్తోంది. అక్కడ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, వీఐపీలు, సెలబ్రెటీలు.. ఇలా ఎవరైనా సరే.. దేవుని ముందు అంతా సమానమే. అందుకే తిరుమల స్వామి వారి అన్న ప్రసాదాన్ని పరమ పవిత్రంగా స్వీకరిస్తారు కూడా. క్యూ లైన్‌లో వేచి ఉండే వారి కోసం కూడా బెల్లం పొంగల్, దద్ద్యోజనం, ఉప్మా, కట్టెపొంగలి, సాంబార్ అన్నం, పాలు అందిస్తారు. క్యూ లైన్ భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకూడదనే ఆలోచనలో టీటీడీ ఈ ఏర్పాట్లు చేసింది. ప్రోటోకాల్, వీఐపీ బ్రేక్, శ్రీవాణి, శీఘ్ర దర్శనం, సేవలు, సర్వ దర్శనం.. ఇలా ఏ క్యూ లైన్ అయినా సరే.. ప్రతి ఒక్కరికీ భక్తితో ప్రసాదం అందిస్తారు. స్వీకరిస్తారు కూడా.

ఇటీవల శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన టీవీ యాంకర్ శివజ్యోతి అత్యుత్సాహం ప్రదర్శించారు. తన సోదరుడితో కలిసి శ్రీవాణి క్యూ లైన్‌లో ఉన్న సమయంలో అక్కడే ఉన్న పొంగలి ప్రసాదంపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పొంగలి ప్రసాదం తీసుకుంటున్న సమయంలో శివజ్యోతి సోదరుడు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. జీవితంలో ఎప్పుడూ అడ్డుక్కోలేదు.. మొదటిసారి అడ్డుకున్నా.. అని వ్యాఖ్యానించిన వెంటనే.. శివజ్యోతి.. రిచ్చెస్ట్ బిచ్చం.. అని కామెంట్ చేశారు. కుభేరులం.. కానీ రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం తిరుపతిలో.. అని శివజ్యోతి అన్నారు. ఆ వెంటనే.. ఆ సోదరుడు.. అడుకుంటే అడుక్కున్నం కానీ.. బాగుంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరమ పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అడుక్కుంటున్నామని.. శ్రీవారి భక్తులను బిచ్చగాళ్లంటూ కామెంట్ చేస్తారా అంటూ మండిపడుతున్నారు. వెంటనే శివజ్యోతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : తిత్తి తీస్తాం.. పవన్ సంచలన కామెంట్స్

ఈ వీడియో దుమారంపై శివజ్యోతి స్పందించారు. తన వ్యాఖ్యాలు చాలామందికి తప్పుగా అనిపిస్తున్నాయని వీడియో మొదలుపెట్టారు. వివరణ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ అన్నారు. తనకు వేంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టమని.. శనివారాల వ్రతాల గురించి ఇప్పటికే ఎన్నో వీడియోలు చేశామన్నారు. వాటి గురించి ఎవరు మాట్లాడలేదు కానీ.. ఈ వీడియో గురించి మాత్రమే మాట్లాడుతున్నారన్నారు. ఏది ఏమైనా సరే తప్పు జరిగిందన్నారు. తన మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే.. తన భావన అది కాదన్నారు. మేము రిచ్ అన్నది 10 వేల రూపాయల క్యూ లైన్‌లో నిలబడినప్పుడు ప్రసాదం తీసుకుంటున్న సమయంలో కాస్ట్లీ లైన్‌లో నిలబడ్డామనే ఉద్దేశంతో అన్నానన్నారు. ఇప్పుడు ఏం చెప్పినా వివరణ ఇచ్చినట్లుగా ఉంటుంది తప్పితే.. తప్పు ఒప్పుకుంటున్నట్లు మీకు అనిపించదు.. తప్పు తన వైపు నుంచి జరిగింది. తన తమ్ముడి తరఫున కూడా క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. తనకు స్వామి అంటే ఎంతో ఇష్టమని.. తాను అనుభవించే ప్రతిదీ స్వామి వారు ఇచ్చిందే అన్నారు. అయినా సరే.. పొరపాటు మాటలు తన నోటి నుంచి వచ్చాయని.. అందుకు క్షమాపణలు కోరారు. కేసులకు భయపడి క్షమాపణలు చెప్పలేదన్న శివజ్యోతి.. తనకు కూడా తన వ్యాఖ్యల్లో తప్పు ఉందని అనిపించిందన్నారు. సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోతుందని కాదన్న శివజ్యోతి.. తాను చేయగలిగింది ఇది ఒక్కటే అని వీడియో రిలీజ్ చేశారు.

Also Read : ఎన్డియే వ్యూహంతో బిజెపిని మమత దెబ్బ కొడతారా..?

అయితే శ్రీవారి భక్తులు మాత్రం శివజ్యోతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది తిరుమల గిరులపై అన్యమత ప్రచారం, ధూమపానం, మద్యపానం, మాంసాహారం తింటూ దొరికారని.. అలాగే ఇన్‌స్టా రీల్స్ చేశారు తప్ప.. ఇలా పవిత్రమైన స్వామి వారి ప్రసాదంపై ఇలా ఎప్పుడు కించపరిచే వ్యాఖ్యలు చేయలేదన్నారు. స్వామి వారి భక్తులను బిచ్చగాళ్లని, ప్రసాదాన్ని ముష్టి అనేలా శివజ్యోతి వ్యాఖ్యలున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీటీడీ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. శివజ్యోతి ఆధార్ ‌కార్డును టీటీడీ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీవారి మీద నమ్మకం లేని వాళ్లు మరోసారి కొండపైకి రాకుండా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇలా కఠినంగా వ్యవహరిస్తే.. మరోసారి ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేసేందుకు భయపడతారని శ్రీవారి భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్